Buchibabu Sana : బిగ్‌బాస్‌ టు రామ్‌చరణ్‌ సినిమా.. ఫిక్స్ అయిపో!

ABN , First Publish Date - 2023-11-13T17:31:21+05:30 IST

రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో నటుడు, బిగ్‌బాస్‌-7 హౌస్‌మేట్‌ అంబటి అర్జున్ ఓ పాత్ర పోషించే అవకాశం దక్కించుకున్నాడు. బిగ్‌బాస్‌ -7 షోకి అర్జున్ 9Arjun ambati) వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వెళ్లిన సంగతి తెలిసిందే.

Buchibabu Sana : బిగ్‌బాస్‌ టు రామ్‌చరణ్‌ సినిమా.. ఫిక్స్ అయిపో!



రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే!  ఈ చిత్రంలో నటుడు, బిగ్‌బాస్‌-7 హౌస్‌మేట్‌ అంబటి అర్జున్  ఓ పాత్ర పోషించే అవకాశం దక్కించుకున్నాడు. బిగ్‌బాస్‌ -7 షోకి  అర్జున్  9Arjun ambati)  వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వెళ్లిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ ఇచ్చిన అన్ని టాస్క్‌ల్లో అదరగొట్టిన ఆయన కెప్టెన్‌ కూడా అయ్యాడు. దీపావళి సందర్భంగా బిగ్‌బాస్‌ ఇంటికి హౌస్‌మేట్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులను, పలువురు అతిథులను నాగ్‌ ఆహ్వానించారు. అలా బిగ్‌బాస్‌  వేదికపైకి వచ్చిన బుచ్చిబాబు అంబటి అర్జున్‌ ఆట తీరును మెచ్చుకున్నారు.  తన టాలెంట్‌ని మెచ్చిన బుచ్చిబాబు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 

ఈ మేరకు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘బుచ్చి అన్నా.. నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్‌.  ఉప్పెన చిత్రానికి అవార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి రెండు మూడుసార్ల్లు ఆఫీస్‌కు వచ్చాను. మీరు చెన్నైలో ఉన్నారని చెప్పారు. ఫోన్  చేద్దామనుకున్నా. కుదరలేదు. ఈలోగా ఇటు వచ్చాను’’ అని అర్జున్‌ అనగా ‘రామ్‌చరణ్‌గారి సినిమాలో సూపర్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నావ్‌. ఫిక్స్‌ అయిపో’ అంటూ పండగ కానుకగా వెల్లడించారు బుచ్చిబాబు. దీంతో, అర్జున్‌ ఎగిరి గంతేశాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌ పనిచేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. 

'‘బుచ్చి అన్న ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఇంకో పది సినిమాలు హిట్‌ కొట్టినా ఇంతే సింపుల్‌గా, కూల్‌గా ఉంటారు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఎవరు వచ్చిన గౌరవంగా మాట్లాడతారు. మీ మొదటి చిత్రంలాగానే ఇది కూడా బ్లాక్‌ బస్టర్‌ అయి, మరో నాలుగైదు అవార్డులు సాధించాలి’ అని అర్జున్‌ ఆకాంక్షించాడు. గెలవకుండా నువ్వు హౌస్‌ నుంచి బయటకు రావొద్దు అని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ వెంకట్‌.. అర్జున్‌కు సూచించాడు. ఇక అర్జున విషయానికొస్తే. అతను పలు సీరియళ్లలో నటించి నిరూపించుకున్నారు. ‘అర్థనారి’, ‘సుందరి’ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రధారుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. గోపీచంద్‌ హీరోగా వచ్చిన ‘సౌఖ్యం’లో విలన్‌గా నటించారు. 

Updated Date - 2023-11-13T17:33:40+05:30 IST