Ambajipeta Marriage Band: సుహాస్‌ పుట్టినరోజు స్పెషల్‌...

ABN , First Publish Date - 2023-08-19T17:40:14+05:30 IST

కలర్‌ ఫొటో, రైటర్‌ పద్మభూషణ్‌ వంటి హిట్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’(Ambajipeta Marriage Band). జీఏ2 పిక్చర్స్‌, దర్శకుడు వెంకటేష్‌ మహా బ్యానర్‌ మహాయన మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Ambajipeta Marriage Band: సుహాస్‌ పుట్టినరోజు స్పెషల్‌...

కలర్‌ ఫొటో, రైటర్‌ పద్మభూషణ్‌ వంటి హిట్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’(Ambajipeta Marriage Band). జీఏ2 పిక్చర్స్‌, దర్శకుడు వెంకటేష్‌ మహా బ్యానర్‌ మహాయన మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం సుహాస్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్‌. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్‌ బ్యాండ్‌ లీడర్‌ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్‌ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ లో సుహాస్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలో టీజర్‌ విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. సుహాస్‌, ప్రతాప్‌ భండారి, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - శేఖర్‌ చంద్ర, సినిమాటోగ్రఫీ - వాజిద్‌ బేగ్‌, ఎడిటింగ్‌- కొదాటి పవన్‌ కల్యాణ్‌.

Updated Date - 2023-08-19T17:40:14+05:30 IST