Akkineni Amala : చాలాకాలం తర్వాత కాలు కదిపి.. అలరించింది

ABN , First Publish Date - 2023-09-03T19:21:18+05:30 IST

నాగార్జున్‌ భార్య అమల ఎన్నో సంవత్సరాల తర్వాత వేదికపై కాలు కదిపారు. హుషారైన నాగార్జున పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఆమె చేసిన డాన్స్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే..

Akkineni Amala : చాలాకాలం తర్వాత కాలు కదిపి.. అలరించింది

నాగార్జున్‌(Nagarjuna) భార్య అమల (Amala) ఎన్నో సంవత్సరాల తర్వాత వేదికపై కాలు కదిపారు. హుషారైన నాగార్జున పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఆమె చేసిన డాన్స్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజీలో జరిగిన ఓ వేడుకలో అమల అక్కినేని డ్యాన్స్‌ చేసి (Amala Dance) అలరించారు. నాగార్జున నటించిన ‘హలో బ్రదర్‌’ (hello brother) లోని ‘ప్రియ రాగాలే’ పాటకు స్టెప్పులేసి అలరించారు. నెటిజన్లను ఈ వీడియో ఎంతో ఆకట్టుకుంటుంది.

కెరీర్‌ బిగినింగ్‌లో నాగార్జునతో ఐదారు చిత్రాల్లో నటించిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2012లో లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ‘మనం’ చిత్రంలో డాన్స్‌ టీచర్‌గా నటించారు. ఇటీవల ‘ఒకే ఒక జీవితం’లో మదర్‌ క్యారెక్టర్‌లో మెరిసిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-09-03T19:21:18+05:30 IST