Harihara veeramallu : హరిహర వీరమల్లు ఎప్పుడో చెప్పేసిన నిర్మాత!

ABN , First Publish Date - 2023-09-04T16:13:51+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 9Pawan kalyan) నటిస్తున్న ‘ఓజి’(OG) చిత్రం నుంచి ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదల చేసిన ట్రైలర్‌కు చక్కని స్పందన రావడంతో అభిమానులంతా ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఇతర చిత్రాల అప్‌డేట్‌లతో కూడా ఆనందంగా ఉన్నారు ఫ్యాన్స్‌. తాజాగా మరో శుభవార్త చెప్పారు నిర్మాత ఏఎమ్‌ రత్నం.

Harihara veeramallu : హరిహర వీరమల్లు ఎప్పుడో చెప్పేసిన నిర్మాత!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 9Pawan kalyan) నటిస్తున్న ‘ఓజి’(OG) చిత్రం నుంచి ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదల చేసిన ట్రైలర్‌కు చక్కని స్పందన రావడంతో అభిమానులంతా ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఇతర చిత్రాల అప్‌డేట్‌లతో కూడా ఆనందంగా ఉన్నారు ఫ్యాన్స్‌. తాజాగా మరో శుభవార్త చెప్పారు నిర్మాత ఏఎమ్‌ రత్నం. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Harihara veeramallu) విడుదలకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా రూపొందిన ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రబృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఏఎమ్‌ రత్నం హాజరయ్యారు. ఈ వేదికగా అడిగిప ప్రశ్నలకు సమాధానం చెబుతూ ‘‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ గురించి చెప్పారు.

‘‘ఇది పిరియాడికల్‌ సినిమా. భారీ బడ్టెట్‌తో పెద్ద స్థాయిలో రూపొందుతుంది. అన్ని చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. గ్రాఫిక్స్‌ వర్క్‌ చాలా చేయాల్సి ఉంటుంది. అలాగే, పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగానూ బిజీగా ఉన్నారు. అందుకే మొదట తక్కువ కాల్షీట్లు ఉన్న చిత్రాలను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి షూటింగ్‌ పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది ఎన్నికల కంటే ముందే చిత్రాన్ని విడుదల చేస?్తం’’ అని అన్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌ కథనాయికగా నటిస్తోంది. బాబీ డియోల్‌, నోరా ఫతేహి, విక్రమ్‌జిత్‌ విర్క్‌, పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-04T16:19:36+05:30 IST