Allu Aravind : లావణ్యకు వర్కవుట్‌ అయింది.. మరి మృణాల్‌కు?

ABN , First Publish Date - 2023-10-31T10:27:04+05:30 IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu aravind) మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలే లావణ్యా త్రిపాఠీ గురించి చేశారు.

Allu Aravind : లావణ్యకు వర్కవుట్‌ అయింది.. మరి మృణాల్‌కు?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu aravind) మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలే లావణ్యా త్రిపాఠీ గురించి చేశారు. ఇప్పుడు అదే నిజం అవుతుంది. లావణ్య త్రిపాఠీ డెహ్రాడూన్ వచ్చిన అమ్మాయి. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. మంచి సినిమాలు చేస్తోంది. కాబట్టి తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలే నిజమై ఇప్పుడు లావణ్యా మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ని పెళ్లాడబోతోంది. తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకలో మృణాల్‌ ఠాకూర్‌ని ఉద్దేశించిన కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సైమా 2023 వేడుకలో అతిథిగా హాజరై ఆయన చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. సెప్టెంబర్‌లో దుబాయ్‌ వేదికగా జరిగిన ''సైమా అవార్డ్‌ వేడుకలకు సంబంధించిన వీడియోలను ఇటీవల నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో ఉత్తమ నటి (క్రిటిక్స్‌) విభాగంలో ‘సీతారామం’ చిత్రానికి గానూ మృణాల్‌ అవార్డు అందుకొంది. అల్లు అరవింద్‌ ఆమెకు ఈ అవార్డు అందించారు.

మృణాల్‌ మాట్లాడుతూ ''ఉత్తమ నటిగా నేను అందుకున్న తొలి అవార్డు ఇదే. ఆనందంతో మాటలు రావడం లేదు. ‘సీతారామం’ టీమ్‌ లేకపోతే ఇది సాధ్యం కాదు. సీత పాత్రకు నేను సరిపోతానని బాగా నమ్మారు. తెలుగింటి అమ్మాయిలా నన్ను తీర్చిదిద్దారు. ఈ సినిమా షూట్‌ మొదలైన నాటి నుంచి హైదరాబాద్‌ని మా ఇంటిలా ఫీలయ్యా. ముంబైకి వెళ్లాలనిపించేది కాదు. అక్కడి నిర్మాతలు చాలామంది ‘మీరు హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యారా?’ అని అడుగుతున్నారు. నాకు మాత్రం హైదరాబాద్‌కు వచ్చేయాలని ఉంది’’ అని ఆమె అన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘గతంలో ఓ వేడుకలో హైదరాబాద్‌ అబ్బాయిని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా రమ్మని లావణ్యకు బ్లెస్సింగ్స్‌ ఇచ్చా. తను తెలుగు హీరోతో ఆమె ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఇప్పుడు నిన్ను కూడా బ్లెస్‌ చేస్తున్నా. నువ్వు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నా’’ అని నవ్వుతూ అన్నారు. నెటిజన్లు చాలామంది మీ మాట నిజం కావచ్చు సర్‌.. సీత పాత్రతో మెప్పించిన మృణాల్‌ తప్పకుండా తెలుగు ఇంటి కోడలే అవుతుందనిపిస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నానితో మృణాల్‌ నటించిన 'హాయ్‌ నాన్న' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్‌ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్‌' సినిమాలో నటిస్తోంది.

Updated Date - 2023-10-31T10:35:32+05:30 IST