Allu Arjun and Trivikram combination: మళ్ళీ మోగనున్న రికార్డుల మోత

ABN, First Publish Date - 2023-06-12T11:11:11+05:30

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ మళ్ళీ చేతులు కలుపుతున్నారని అధికారిక ప్రకటన వచ్చింది. ఇది ఆహా ఓటిటి ఛానల్ కోసం చేస్తారని కూడా అంటున్నారు. అయితే ఈ వార్త వివరంగా ఇవ్వకుండా ఇద్దరూ మళ్ళీ కలుస్తున్నారు అని మాత్రమే ఇచ్చారు.

Allu Arjun and Trivikram combination: మళ్ళీ మోగనున్న రికార్డుల మోత
Trivikram Srinivas and Allu Arjun
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (AlluArjun) మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) తో చేతులు కలుపుతున్నారు. 'అల వైకుంఠపురం లో' (AlaVaikuntapuramLo) లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరువాత, ఆ ఇద్దరూ మళ్ళీ చేతులు కలుపుతున్నారు అని అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇది సినిమా చేస్తారా, లేదా ఆహా (Aha) ఛానల్ కోసం ఏదైనా షో చేస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే మాత్రం రావటం లేదు.

గత రెండు రోజుల నుండీ ఆహా ఓటిటి ఛానల్ #AhaOTT ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంది అనే వార్త వైరల్ అవుతూనే వుంది. ఈరోజు ఆ వార్తని ఆహా ఛానల్ వాళ్ళు ప్రకటించారు. అయితే ఇది సినిమా అయితే ఉండకపోవచ్చు అని, ఎందుకంటే ఇది ఆహా ఛానల్ కోసం కాబట్టి, ఏదైనా షో ఇద్దరూ ప్లాన్ చేసి వుంటారు అని తెలుస్తోంది.

alluarjunnewlook.jpg

అల్లు అరవింద్ (AlluAravind) మరికొందరు కలిపి ప్రారంభించిన ఈ ఆహా #Aha ఛానల్ ఇప్పుడు టాప్ లోకి తీసుకువెళ్ళడానికి ఏదైనా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ప్లాన్ చెయ్యాలని అనుకున్నారని, అందుకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల హెల్ప్ తీసుకోవాలని అనుకున్నారని తెలిసింది. అందుకనే గత రెండు రోజులుగా బ్రేకింగ్ న్యూస్ అంటూ చెప్పుకొచ్చారని తెలిసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు #MaheshBabu సినిమా 'గుంటూరు కారం' #GunturKaram సినిమా చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ (Sukumar) తో 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ చేస్తున్నారు. ఈ మధ్యలో వీరిద్దరూ ఏమైనా ఈ షో కోసం ప్లాన్ చేసుకోవచ్చు అని తెలిసింది.

Updated Date - 2023-06-12T11:11:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!