సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Sneha Reddy: అందరి కన్నా టాప్ లో వున్న అల్లు అర్జున్ భార్య

ABN, First Publish Date - 2023-04-04T15:30:19+05:30

చాలామంది అగ్ర నటుల భార్యలు నటిగా చేశారు, మోడల్స్ గా కూడా, అలాగే కొందరు బిజినెస్ వుమన్ కూడా, అలాగే చాలామంది తమ భర్తల సినిమాల్లో ఎదో విధంగా భాగం అవుతూ వుంటారు. కానీ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి మాత్రం ఇవేమీ కాకుండానే టాప్ లో వున్నారు. అదెలా అంటే...

Allu Arjun and his wife Sneha Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ (Allu Arjun) భార్య అల్లు స్నేహ రెడ్డి (Allu Sneha Reddy) సాంఘీక మాధ్యమం లో చాలా ఆక్టివ్ గా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలు, పిల్లల ఫోటోలు అలాగే అల్లు అర్జున్ తో వున్న ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఆమె. అలాగే ఆమె ఎక్కువ ట్రావెల్ చేసిన ఆ ట్రావెల్ లో ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఒక ఆసక్తికర అంశం ఏంటి అంటే, అల్లు స్నేహ తన భర్త అర్జున్ సినిమా ఫోటోలు మాత్రం ఎప్పుడూ షేర్ చెయ్యదు. చాలామంది అగ్ర నటుల భార్యలు తమ భర్తల సినిమా విశేషాలను కూడా షేర్ చేస్తూ వుంటారు, కానీ స్నేహ మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె తన పని గురించి మాత్రమే తన సాంఘీక మాధ్యమం లో షేర్ చేస్తుంది కానీ, భర్త చేసే పనిని ఇందులో చేర్చాడు. ఎందుకంటే అది అతని ప్రొఫెషనల్ వర్క్ అని స్నేహ భావించటమే.

ఇంకో ఆసక్తికర వార్త ఏంటి అంటే, ఇలా నటుల భార్యల్లో అత్యధిక ఫాలోయింగ్ వున్న ఏకైక మహిళ స్నేహా రెడ్డి మాత్రమే. ఎందుకంటే చాలామంది భార్యలు, తమ భర్తల సినిమాల గురించి, అలాగే భర్తల వర్క్ గురించి, అలాగే భర్తలతో కూడా కొన్ని సినిమాలకు కొంతమంది భార్యలు పని చేస్తూ వుంటారు. కానీ స్నేహ మాత్రం ఎప్పుడూ భర్త అల్లు అర్జున్ తో ఒక్క సినిమాకి అయినా పని చేసినట్టు కానీ, లేదా ఆ సినిమాలో భాగం అయినట్టు కానీ వినలేదు, చూడలేదు, చదవలేదు. ఎప్పుడయినా వెళితే పిల్లలని తీసుకొని భర్తని చూడటానికి షూటింగ్ కి వెళ్ళిందేమో. అంతే కానీ భర్త సినిమాలో ఆమె ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అయినా ఆమెకి ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి.

ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చిందంటే, ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకి 8.8 మిలియన్ ఫాలోవర్స్ వున్నారంటే, వాళ్ళందరూ ఆమె స్వంతంగా తెచ్చుకున్నవే. అయితే ఆమె అల్లు అర్జున్ భార్య అని అందరికీ తెలుసు కాబట్టి ఆలా కొంతమంది మాత్రమే ఫాలో అయ్యారేమో కానీ, ఆమె మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్వతంత్ర మహిళ గానే కనపడుతూ ఉంటుంది.

ఇప్పుడు తాజాగా ఆమె కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. అందులో ఆమె డిజైనర్స్ రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా అవుట్ ఫిట్ ని ధరించి ఒక ప్రిన్సెస్ లా కనపడుతోంది. చాలామంది నటుల భార్యలతో పోలిస్తే అల్లు స్నేహ ఎంతో ఫిట్ గా కనపడుతూ ఉంటుంది. దానికి కారణం మంచి ఆహారం, యోగ, అలాగే వ్యాయామం చెయ్యడం లాంటివి. ఆమె ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇలా మిగతా నటులు భార్యల ఇన్ స్టాగ్రామ్ కానక చూస్తే, రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన కామినేని (Upasana Kamineni Konidela) కి 8 మిలియన్ ఫాలోయర్స్, మహేష్ బాబు (Mahesh Babu) భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) కి 3 మిలియన్ ఫాలోవర్లు, హిందీలో అగ్ర నటుడు షా రుఖ్ ఖాన్ (Shah Rukh Khan) భార్య గౌరి ఖాన్ (Gauri Khan) కి కూడా 4.8 మిలియన్ ఫాలోవర్లు మాత్రమే వున్నారు. సూర్య (Suriya) భార్య జ్యోతిక (Jyothika) నటి కూడా, కానీ ఆమె ఫాలోవర్స్ చూస్తే ఇంకా మిలియన్ లోకి కూడా రాలేదు.

Updated Date - 2023-04-04T15:31:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!