Pushpa 2:షెడ్యూల్‌పై బన్నీ అసంతృప్తి!

ABN , First Publish Date - 2023-04-08T21:34:12+05:30 IST

అల్లు అర్జున్‌ (allu arjun) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 3 నిమిషాల 7 సెకన్ల నిడివి గల ‘పుష్ప-2 టీజర్‌ సోషల్‌ మీడియాలో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.

Pushpa 2:షెడ్యూల్‌పై బన్నీ అసంతృప్తి!

అల్లు అర్జున్‌ (allu arjun) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 3 నిమిషాల 7 సెకన్ల నిడివి గల ‘పుష్ప-2 టీజర్‌ సోషల్‌ మీడియాలో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. టీజర్‌ రూపంలో అభిమానులకు బర్త్‌డే ట్రీట్‌ (bunny birthday Treat) ఇచ్చారు బన్నీ. అప్‌డేట్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సర్‌ప్రైజ్‌ గ్లింప్స్‌తో కడుపు నిండినట్లు భావిస్తున్నారు. ఇప్పుడీ టీజర్‌ ట్రెండింగ్‌లో ఉంది. దీంతోపాటు మరో వార్త కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా వైజాగ్‌లో ఓ షెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఆ షెడ్యూల్‌లో తెరకెక్కించిన సన్నివేశాల పట్ల హీరో అల్లు అర్జున్‌ సంతృప్తిగా లేరట. ఏదో మిస్‌ అయిందనే భావనలో ఉన్నారట బన్నీ. ఆ సన్నివేశాలను రీషూట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మళ్లీ వైజాగ్‌లో ఆ సన్నివేశాలను తెరకెక్కిస్తారట. (Reshoot for Vizag schedule) దీని కోసం దాదాపు నెలరోజులు సమయం పట్టొచ్చని చెబుతున్నారు. దీని వల్ల ఇకపై చేసే షెడ్యూల్‌ మొత్తం డిస్టర్బ్‌ అయినట్లే అని సన్నిహితుల నుంచి సమాచారం. (bunny unhappy with Output)

ప్రస్తుతానికైతే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌తో ట్రీట్‌ ఇచ్చిన ఆయన ఆనందంగానే ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో ‘పుష్ప-2’ కథేంటి అన్నది క్లియర్‌గా చెప్పేశారు. అయితే టీజర్‌లో చెప్పిన ఓ డైలాగ్‌ ‘పుష్ప-2’కు సీక్వెల్‌ కూడా ఉండొచ్చని అనుకుంటున్నారు. పుష్పరాజ్‌ మరణించాడని కొందరు అంటుంటే.. మరికొందరు చైనా, జపాన్‌ ప్రాంతాల్లో ఉన్నట్లు చెప్పారు’. దీంతో పుష్ప-2 కన్‌క్లూజన్‌లో పుష్ప-3 కూడా ఉండొచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే అభిమానులకు ఇది ఆనందకరమైన వార్తే.

సుకుమార్‌ (sukumar)దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పుష్ప చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయలో విజయం సాధించడంతో ‘పుష్ప-2 అంతకుమించి ఉండాలని సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-04-08T23:09:32+05:30 IST