Allu Arjun Shock: అల్లరి అర్హ.. బన్నీ షాక్‌!

ABN , First Publish Date - 2023-03-21T15:10:41+05:30 IST

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టీ అర్హ చేసే అల్లరి పనులు చూసి మురిసిపోతుంటారు. ఖాళీ సమయం దొరకితే సరదాగా పిల్లలతోనే ఎక్కువ గడుపుతుంటారు.

Allu Arjun Shock: అల్లరి అర్హ.. బన్నీ షాక్‌!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) గారాలపట్టీ అర్హ చేసే అల్లరి పనులు చూసి మురిసిపోతుంటారు. ఖాళీ సమయం దొరకితే సరదాగా పిల్లలతోనే ఎక్కువ గడుపుతుంటారు. అందులోనూ ఎక్కువ తన కూతురు అర్హతోనే (Allu Arha) ఎక్కువగా ఆడుతుంటారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తన ముద్దు ముద్దు మాటలకు అభిమానులు కూడా మురిసిపోతుంటారు. తాజాగా తనలోని మరో టాలెంట్‌ను బయపెట్టింది అర్హ (Allu Arha Hideen talent) . చిన్న వయసులోనే అతి కష్టమైన యోగాసనాలు వేసి తండ్రిని ఆశ్చర్యపరచింది. తాజాగా తమ గార్డెన్‌లో అర్హ యోగాసనం వేస్తుంటే అది చూసి బన్నీ షాక్‌ అవుతున్నట్లు స్నేహారెడ్డి (Sneha reddy) ఓ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతుంది. గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వంలో సమంత (Samantha) కీలక పాత్ర పోషించిన ‘శాకుంతలం’ భరత పాత్రతో అర్హ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే!

aaaa.jpg

ప్రస్తుతం బన్నీ పుష్ప-2 (Pushpa-2) చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల వైజాగ్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఏప్రిల్‌ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇవ్వబోతున్నరు. మూడు నిమిషాల యాక్షన్‌ కట్‌ టీజర్‌ను విడుదల చేయనున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన టీజర్‌ కట్‌లో బిజీగా ఉన్నారు దర్శకుడు సుకుమార్‌. దేవిశ్రీ ప్రసాద్‌ దీనికి బీజీఎం చేసే పనిలో ఉన్నారని తెలిసింద

Updated Date - 2023-03-21T16:11:44+05:30 IST