సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: అసలైన సమ్మర్‌ ‘దసరా’

ABN, First Publish Date - 2023-04-17T15:06:23+05:30

నాని (Nani) హీరోగా నటించిన ‘దసరా’ (Dasara) చిత్రానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా ఆదరణ మాత్రం తగ్గలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాని (Nani) హీరోగా నటించిన ‘దసరా’ (Dasara) చిత్రానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇటీవల చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా దసరా టీమ్‌ను అభినందించారు. సినీ పరిశ్రమకు చెందిన ఎందరో దసరా టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్‌ (Allu arjun) ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు.

‘‘దసరా’ టీమ్‌ మొత్తానికి నా అభినందనలు. చక్కని కథతో అద్భుతంగా తెరకెక్కించారు. నాని, కీర్తి అత్యుత్తమ నటనతో ఆకట్టుకున్నారు. సంతోష్‌ నారాయణన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సత్యన్‌ కెమెరా పనితనం బాగున్నాయి. కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ శ్రీకాంత్‌ ఓదెల తన పనితనంతో తొలి ప్రయత్నంలోనే అదరగొట్టేశారు. ప్రతి సీన్‌నూ ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. వేసవిలో వచ్చిన అసలైన దసరా ఇది’’ అని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. (Allu Arjun praises Dasara team)

నాని, కీర్తి సురేశ్‌ జంటగా సింగరేణి ప్రాంతం నేపథ్యంలో ‘దసరా’ సినిమా తెరకెక్కింది. స్నేహం, ప్రేమ, పగ.. వంటి ఎమోషన్స్‌తో రూపొందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. నాని నటించిన చిత్రాల్లో వంద కోట్ల మార్కుకు చేరిన తొలి చిత్రమిది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరా ఫిలింస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నాని తన 30వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శౌరవ్‌ దర్శకుడు.

Updated Date - 2023-04-17T15:06:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!