Mangalavaaram : ఆర్మీ ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్‌

ABN , First Publish Date - 2023-11-10T11:32:18+05:30 IST

అజయ్‌ భూపతి (Ajay bhupati) దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’ (mangalavaaram). పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal rajputh), ‘రంగం’ ఫేమ్‌ అజ్మల్‌ అమీర్‌ జంటగా నటించారు. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి క్రియేటివ్‌ వర్క్స్‌ నిర్మాణ భాగస్వామి.

Mangalavaaram : ఆర్మీ ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్‌

అజయ్‌ భూపతి (Ajay bhupati) దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’ (mangalavaaram). పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal rajputh), ‘రంగం’ ఫేమ్‌ అజ్మల్‌ అమీర్‌ జంటగా నటించారు. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి క్రియేటివ్‌ వర్క్స్‌ నిర్మాణ భాగస్వామి. ముద్ర వీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతి రెడ్డి, గునుపాటి, సురేష్‌ వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెల 11, శనివారం హైదరాబాద్‌ జె.ఆర్‌.సి. కన్వెన్షన్  సెంటర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్  ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే అల్లు అర్జున్ ఆర్మీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరగనుంది.

Allu-arjn.jpg

ఇప్పటికే ట్రైలర్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. విడుదలైన మూడు పాటలకు స్పందన బావుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తరహాలో మరోసారి డిఫరెంట్‌ కంటెంట్‌తో, కమర్షియల్‌ బేస్డ్‌ సినిమాతో అజయ్‌భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

Updated Date - 2023-11-10T12:19:08+05:30 IST