సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: బాలీవుడ్‌ నిర్మాత పెళ్లిలో బన్నీ సందడి!

ABN, First Publish Date - 2023-06-12T15:02:55+05:30

బాలీవుడ్‌ అగ్ర నిర్మాత మధు మంతెన (Madhu mantena) వివాహం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. ప్రముఖ యోగా ట్రైనర్‌ ఐరా త్రివేదిని (Ira Trivedi) ఆయన వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్‌ (Allu Arjun) హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ అగ్ర నిర్మాత మధు మంతెన (Madhu mantena) వివాహం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. ప్రముఖ యోగా ట్రైనర్‌ ఐరా త్రివేదిని (Ira Trivedi) ఆయన వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్‌ (Allu Arjun) హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ పెళ్లికి వచ్చిన బాలీవుడ్‌ హీరోలు ఆమిర్‌ ఖాన్‌(Amir khan), హృతిక్‌ రోషన్‌(Hrithik roshan) లతో కలిసి సందడి చేశారు. ముగ్గురు కలిసి సరదాగా ముచ్చటించుకున్నారు. వీళ్ల ముగ్గురు దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్‌ వీటిని విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

‘పుష్ప’తో అల్లు అర్జున్‌ దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనతో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘పుష్ప 2’ పూర్తి కాగానే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది మధు మంతెనతో కలిసి అల్లు అరవింద్‌ ‘రామాయణం’ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి.

Updated Date - 2023-06-12T15:02:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!