Allu Arjun : 20 ఏళ్ళ కల నిజమైంది.. అదే బెస్ట్ కంప్లిమెంట్ 

ABN , First Publish Date - 2023-10-22T14:48:57+05:30 IST

ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుని చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్ . ‘పుష్ప ది రైజ్‌’ చిత్రానికిగానూ ఆయనకు ఆ పురస్కారం దక్కింది. ఈ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. తన మిత్రుడైన దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా అనిపించిందన్నారు.

Allu Arjun : 20 ఏళ్ళ కల నిజమైంది.. అదే బెస్ట్ కంప్లిమెంట్ 

ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుని చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్(Allu Arjun) . ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa)చిత్రానికిగానూ ఆయనకు ఆ పురస్కారం దక్కింది. ఈ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. తన మిత్రుడైన దేవిశ్రీ (Dsp) ప్రసాద్‌తో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా అనిపించిందన్నారు. శనివారం రాత్రి మైత్రీ మూవీమేకర్స్‌ ఏర్పాటు చేసిన పార్టీలో అల్లు అర్జున మాట్లాడుతూ ఈ చిత్రంతో నా నటనకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సుకుమార్‌ ఎంతో శ్రమించారు. ఆ క్రెడిట్‌ ఆయనకే దక్కుతుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్‌తో నాకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్య నుంచి మా జర్నీ కొనసాగుతుంది.

"బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్‌కి ఎన్నోసార్లు చెప్పా. నాకు అలా వెళ్లడం కుదరదు. హీరోయిన్స, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కు అలా వెళ్లడం ఈజీగా ఉంటుంది. ఇదే విషయం ఈ 20 ఏళ్లలో దేవికి ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ.. ‘ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా’ అనేవాడు. ఇది సాధ్యమా అనేకునేవాడిని. కానీ మేమిద్దరం ఒకేసారి ‘పుష్ప’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. అక్కడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ల నుంచి దేవితో అంటున్న మాట ఇలా నిజమైనందుకు నాకు సంతోషంగా అనిపించింది. నేషనల్‌ అవార్డ్స్‌ ప్రకటనలో మా ఇద్దరి పేర్లు విని మా నాన్న ఎంతో ఆనందించారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్టు ఉందన్నారు. ‘ప్రిన్సిపల్‌ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్‌ దగ్గర మెడల్స్‌ తీసుకుంటామని అనుకున్నావా?’ అని ఆయన్ని అడిగా. మన జర్నీలో ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. గట్టిగా ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మామూలుగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటూనే ఏదైనా సరే జరుగుతుంది. ఇలాంటి అవార్డులు అందుకోవాలని ఎప్పటి నుంచో నాకున్న కల. ఆ అవార్డు నాకు రావాలని సుకుమార్‌ బలంగా కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎఛీవర్‌ ఆయనే. నేను కేవలం ఎఛీవ్‌మెంట్‌ మాత్రమే.  అయితే నా  బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే.. ఏరా? ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి టీసీలు తీసుకోవడమే తప్పా? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మెడల్ తీసుకుంటుంటే నాకెంతో బాధగా ఉందో తెలుసా? అని అన్నారు. ఇదే బెస్ట్ కంప్లిమెంట్ నాకు అన్నారు బన్నీ.

Updated Date - 2023-10-22T15:01:59+05:30 IST