Allu Aravind : కాంగ్రెస్‌ ప్రభుత్వం గెలుపు సంతోషం!

ABN , First Publish Date - 2023-12-04T15:57:20+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం గెలుపొందడం ఆనందంగా ఉందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ (Allu aravind) అన్నారు. సోమవారం ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వాన్ని స్వాగతం పలుకుతున్నాం

Allu Aravind : కాంగ్రెస్‌ ప్రభుత్వం గెలుపు సంతోషం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం గెలుపొందడం ఆనందంగా ఉందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ (Allu aravind) అన్నారు. సోమవారం ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వాన్ని స్వాగతం పలుకుతున్నాం అంటూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, నాయకులకు అభినందనలు తెలిపారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొత్త కాదని, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమను ఎంతో అండగా ఉంటూ ప్రోత్సహించాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు.

Updated Date - 2023-12-04T16:02:32+05:30 IST