సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Aravind: కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో ఏమి జరిగింది

ABN, First Publish Date - 2023-04-23T16:41:26+05:30

కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో ఏమి జరిగింది, అక్కడ మొదలయిన కథ చివరికి ఎటువంటి ముగింపు తీసుకు వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్ లో మొదలయిన కథ ఇటు రాజకీయంగా, అటు అధికారుల్లోనూ ఎటువంటి ప్రభావం చూపించింది అనేదే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ (Kotabommali Police Station) అనగానే ఇదేదో శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో వున్న నిజమయిన పోలీస్ స్టేషన్ అనుకునేగలరు. కాదండీ! ఇది అల్లు అరవింద్ (Allu Aravind), బన్నీ వాసుల (Bunny Vas) 'జిఏ2' (Geetha Arts) నుండు రాబోయే మరొక బడ్జెట్ సినిమా. ఇది మలయాళం సినిమా 'నయట్టు' #Nayattu కి రీమేక్. మలయాళం సినిమా పెద్ద హిట్ అయింది అందులో జోజు జార్జ్ (Joju George) ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు తెలుగు రీమేక్ లో ఈ పాత్రని సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) పోషిస్తున్నాడు అని తెలిసింది. ఇది ఒక పోలీస్ డ్రామా కదా, మలయాళం లో చాలా బాగా తీశారు, మరి దీన్ని తెలుగులో ఎలా మార్పులు చేసి తీసుకుంటారో చూడాలి.

పోలీస్ డ్రామా కాబట్టే దీనికి 'కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్' అని పేరు పెట్టినట్టుగా తెలిసింది. ముందు ఈ సినిమాని పెద్ద నటులతో కొంచెం మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు, కానీ అంత బడ్జెట్ ఎందుకు, చిన్న బడ్జెట్ లో తీసెయ్యాలి అనుకొని ఈ సినిమా చిన్న నటుల్ని పెట్టి తీస్తున్నారు అని తెలిసింది.

ఈ తెలుగు రీమేక్ లో జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) కూతురు శివాత్మిక రాజశేఖర్ (Shivatmika Rajasekhar) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ (Vijay Master) మాస్టర్ కొడుకు రాహుల్ (Rahul) ఇంకో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మలయాళం లో ఒక మహిళా పోలీస్ అధికారి పాత్ర కీలకం అయినది ఒకటుంది, ఈ తెలుగు రీమేక్ లో ఆ పాత్ర కోసమని వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) ని తీసుకున్నారు. షూటింగ్ ఆరుకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఇంకా అధికారికంగా మాత్రం ఎటువంటి వార్త రాలేదు.

ఈ మలయాళం సినిమా 'నయట్టు' విడుదల అయిన వెంటనే అంటే 2021 లోనే గీత ఆర్ట్స్ (Geetha Arts) రీమేక్ రైట్స్ తీసుకున్నారు, గత సంవత్సరం రీమేక్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు కానీ, బడ్జెట్ కుదరక ఆగిపోయారు, షెల్వ్ చేసేద్దామని అనుకొని పక్కన పడేసారు. మళ్ళీ ఇలా బడ్జెట్ సినిమాగా చేసి తీస్తున్నారు అని పరిశ్రమలో అనుకుంటున్నారు.

Updated Date - 2023-04-23T17:10:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!