Allu Aravind: అన్నింటికీ సమాధానం చెబుతాం!

ABN , First Publish Date - 2023-12-10T15:05:08+05:30 IST

నాగచైతన్య(Naga chaitanya), సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఓ మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది.

Allu Aravind: అన్నింటికీ సమాధానం చెబుతాం!


నాగచైతన్య(Naga chaitanya), సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఓ మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ఏడాదిన్నర నుంచి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ చిత్రం విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఓ కొత్త అనుభూతి కలిగించేందుకు దర్శకుడు చందు, నటుడు నాగచైతన్యతో టీమ్‌ అందరూ ఎంతో కష్టపడుతున్నారు. ఓ దర్శకుడికి హిట్‌ వస్తే వరుసగా అవకాశాలు వస్తాయి. వాటన్నింటినీ వదులుకుని ఫస్ట్‌ ఇచ్చిన కమిట్‌మెంట్‌ కోసం నిలబడేవారు చాలా తక్కువమంది ఉంటారు. ‘కార్తికేయ 2’ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ మా సంస్థలోనే చేయాలనే కమిట్‌మెంట్‌ మీదే నిలబడ్డాడు. ‘తండేల్‌’ టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి దాని అర్థం తెలుసుకునేందుకు  ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. అలాగే, ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకొన్నాళ్లు ఆ సందేహాలను అలాగే ఉంచండి. అన్నింటికీ మా సినిమాతో సమాధానం చెబుతాం’’ అల్లు అరవింద్‌ అన్నారు.

అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ " నా కెరీర్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న ‘100% లవ్‌’ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పైనే నిర్మితమైంది. ‘తండేల్‌’ కోసం ఈ బ్యానర్‌లో వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రం
ఇది. లవ్‌స్టోరీ’ తర్వాత మరోసారి సాయిపల్లవితో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2023-12-10T15:05:09+05:30 IST