కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ANR Lives On: సెలబ్రిటీస్ అందరూ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినవేళ...

ABN, First Publish Date - 2023-09-20T11:38:34+05:30

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన చాలామంది సెలబ్రిటీస్, అలాగే ఇతర రంగాలకి చెందిన వారు ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని విగ్రహావిష్కరణ సందర్భంగా హాజరయ్యారు, ఎవెరెవరు వచ్చారంటే...

Ram Charan and Mahesh Babu at the 100th Birthday Celebrations of Akkineni Nageswara Rao

మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచు విష్ణు, శ్రీకాంత్, జగపతి బాబు, మోహన్ బాబు, అశ్విని దత్, కె ఎల్ నారాయణ, కీరవాణి, ఒకరేమిటి ఇలా పరిశ్రమనుండి చాలామంది అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలి వస్తున్నారు. #CelebratingANR100

వచ్చిన వాళ్ళను అందరినీ నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుప్రియ సాదరంగా ఆహ్వానిస్తూ వాళ్ళని దగ్గరుండి కూర్చోబెడుతున్నారు. ఈ రోజు అక్కినేని 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం అక్కినేని కుటుంబ సభ్యులు అక్కినేని విగ్రహం అన్నపూర్ణ స్టూడియోలో పెట్టాలని నిర్ణయించారు. #ANRLivesOn

ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ని ఆహ్వానించి అతనితో ఈ విగ్రహావిష్కరణ కావించారు. దీనికి పరిశ్రమలో అందరినీ ఆహ్వానించారు. పిల్లలుగా మా నాన్నగారికి చేయగలిగేది ఇటువంటి మంచి పనులే అని కుటుంబ సభ్యులు అన్నారు.

ఈ సందర్భంగా పరిశ్రమనుండి వచ్చిన వాళ్ళ ఫోటోలు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-09-20T11:38:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!