AICWA Letter to PM: తక్షణమే నిలిపేయాలి.. ఓటీటీలో కూడా రానివ్వకూడదు!

ABN , First Publish Date - 2023-06-20T15:40:01+05:30 IST

ప్రభాస్‌ శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం విడుదలైనప్పటి నుంచి వివాదాలు, విమర్శలు చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలంటూ ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

AICWA Letter to PM: తక్షణమే నిలిపేయాలి.. ఓటీటీలో కూడా రానివ్వకూడదు!

ప్రభాస్‌ (Prabhas) శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం విడుదలైనప్పటి నుంచి వివాదాలు, విమర్శలు చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలంటూ (Ban Adipurush) ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (All india Cine workers Association) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ (letter to Modi) రాసింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు శ్రీరాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని పేర్కొంది. తక్షణమే సినిమాను నిలిపేయాలని ఆ లేఖ ద్వారా ప్రధానిని కోరారు.

‘‘ఆదిపురుష్‌’ హిందువుల మనోభావాలను, సనాతర ధర్మాన్ని దెబ్బ తీసేలా ఉంది. రాముడు అందరికీ దేవుడు. ఈ చిత్రంలో డైలాగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధపట్టేలా ఉన్నాయి. దేవుళ్లను వీడియో గేమ్‌లో పాత్రల్లాగా చిత్రీకరించారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంతటి అవమానకరమైన చిత్రం మళ్లీ రాకూడదు. శ్రీరాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ సినిమా పూర్తిగా విధ్వంసం చేసింది. దీనిని వెంటనే నిలివేయండి. భవిష్యత్తులో ఓటీటీలో కూడా దీనిని ప్రదర్శించవద్దు. ఈ మేరకు ఆదేశించాలని మిమ్మల్ని కోరుతున్నాం’’ అని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో ‘ఆదిపురుష్‌’ దర్శకుడు ఓం రౌత్‌, మాటల రచయిత మనోజ్‌ మంటషీర్‌ శుక్లాపైౖ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు పొరుగు దేశమైన నేపాల్‌లో ఈ చిత్రాన్ని నిషేదించిన సంగతి తెలిసిందే. సీతాదేవీ నేపాల్‌లో జన్మిస్తే ఆమెను భారత్‌లో పుట్టిన్లు చూపించినట్లు డైలాగ్‌ ఉందని, దానిని తక్షణమే మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం ఖాట్మాండు మేయర్‌కు క్షమాపణలే ఓ లేఖ రాసింది. జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.375 కోట్ల వసూళ్లు చేసిందని చిత్ర బృందం ప్రకటించింది.

Untitled-2.jpg

Updated Date - 2023-06-20T15:41:17+05:30 IST