Alia bhatt: ఆయనతో పనంటే.. స్కూల్‌కి వెళ్లినట్లే!

ABN , First Publish Date - 2023-04-14T15:49:52+05:30 IST

రాజమౌళి (Rajamouli) తో పని చేయడం అంటూ స్కూల్‌కి వెళ్లడంతో సమానం అన్నారు బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌(Aliabhatt).

Alia bhatt: ఆయనతో పనంటే.. స్కూల్‌కి వెళ్లినట్లే!

రాజమౌళి (Rajamouli) తో పని చేయడం అంటూ స్కూల్‌కి వెళ్లడంతో సమానం అన్నారు బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌(Aliabhatt). టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘100 మోస్ట్‌ ఇన్ల్ఫ్‌యెన్సియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2023’ (Times100 most influential people) జాబితాలో చోటు దక్కించుకున్న రాజమౌళి గురించి ఆలియా మాట్లాడారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆలియ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటెస్ట్‌ డైరెక్టర్‌ రాజమౌళిని మొదటిసారి ‘బాహుబలి’ (Bahubali) ప్రీమియర్‌ షోలో కలిశాను. ఆ సినిమా చూసినంత సేపు ఆశ్చర్యానికి లోనయ్యాను. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక అప్పుడే పుట్టింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో(RRR) ఆ కోరిక తీరింది. రాజమౌళితో పనిచేయడం అంటే స్కూల్‌కు వెళ్లడంలాంటిదే! ఆయన నుంచి క్రియేటివ్‌గా ఎన్నో మంచి విషయాలు, కొత్త అంశాలు నేర్చుకోవచ్చు. నేను ఆయన్ను మాస్టర్‌ స్టోరీ టెల్లర్‌ అని పిలుస్తాను. కథను అద్భుతంగా తెరకెక్కించగలరు. తన సినిమాల ద్వారా అందరినీ ఒక చోటికి చేర్చుతారు. నటన పరంగా ఆయనను సలహా కోరగా.. ఏ క్యారెక్టర్‌లో నటించినా, నిడివి ఎక్కువైనా, తక్కువైనా దానిని ప్రేమతో చేయాలని ఆయన చెప్పారు. సినిమా సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేదు. మనం చేసిన పాత్ర జనాలకు గుర్తుండిపోయేలా నటించాలన్నారు’’ అని ఆలియా రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. (OsRcar 95)

2.jpg

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించారు ఆలియాభట్‌. ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించి అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు అందుకుంది. ప్రపంచ సినీ రంగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ అవార్డు సైతం ఈ చిత్రాన్ని వరించింది. ఇందులో ‘నాటునాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ను అందుకుంది.

.

Updated Date - 2023-04-14T15:53:22+05:30 IST