Dhootha: చైతూని.. ఈ ‘దూత’ ఏం చేస్తాడో

ABN , First Publish Date - 2023-11-14T15:55:04+05:30 IST

అక్కినేని నాగ‌చైత‌న్య మొట్ట మొద‌టిసారిగా దూత అనే వెబ్ సీరిస్‌తో డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఏ ముహుర్తానా దీనిని మొద‌లుపెట్టారో గానీ ఒక‌డుగు ముందుకేస్తే రెండ‌డుగులు వెనుక‌కు అన్న చందంగా త‌యారైంది. ఇన్నాళ్లకు ఈ సిరీస్ విడుద‌లపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది,

Dhootha: చైతూని.. ఈ ‘దూత’ ఏం చేస్తాడో
dhootha

అక్కినేని నాగ‌చైత‌న్య(Akkineni Naga Chaitanya) మొట్ట మొద‌టిసారిగా ‘దూత’ (Dhootha) అనే వెబ్ సీరిస్‌(Web Series)తో డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. అక్కినేని కుటుంబంతో ‘మ‌నం’, అఖిల్‌తో ‘హ‌లో’, చైతన్యతో ‘థ్యాంక్యూ’ వంటి చిత్రాల‌తో పాటు సూర్య‌తో 24, నానితో గ్యాంగ్‌లీడ‌ర్ వంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం చేసిన విక్ర‌మ్ కే కుమార్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుండ‌గా, అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సంస్థ‌ నిర్మిస్తుండ‌డం విశేషం. చైత‌న్య‌కు జోడిగా ప్రియా భ‌వానీ శంక‌ర్‌, పార్వ‌తి, ప్రాచీ దేశాయ్‌, ప్ర‌ధాన పాత్ర‌లో త‌రుణ్ భాస్క‌ర్ న‌టిస్తున్నారు.

అయితే ఏ ముహుర్తానా దీనిని మొద‌లుపెట్టారో గానీ ఒక‌డుగు ముందుకేస్తే రెండ‌డుగులు వెనుక‌కు అన్న చందంగా త‌యారైంది. సూప‌ర్ నేచుర‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో సిరీస్‌ త్వ‌ర‌లో అమెజాన్‌లో అంటూ 2022 ఏప్రిల్‌లో ఓ గ్లిమ్స్ విడుద‌ల చేయ‌గా మంచి బ‌జ్ క్రియేట్ చేసి సోష‌ల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కానీ మ‌ళ్లీ యేడాదిన్న‌ర గ‌డిచినా మ‌రో ఆప్డేట్ ఇవ్వ‌లేదు. అస‌లు సిరీస్ ఉందా లేదా విడుద‌ల అవుతుందా, లేదా అనే అనుమానాలు అభిమానుల్లో బాగా పెరిగిపోయింది కూడా.


ఇదిలాఉండ‌గా ఇన్నాళ్లకు ఈ సిరీస్ విడుద‌లపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది, న‌వంబ‌ర్ 23న నాగ చైత‌న్య జ‌న్మ‌దినం సంద‌ర్బంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి డిసెంబ‌ర్ 1 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్న‌ట్లు సోష‌ల్‌మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుత‌న్నాయి. అమెజాన్ సంస్థ‌ దాదాపు రూ. 40కోట్లు ఈ సిరీస్‌కు ఖ‌ర్చు చేసింద‌ని, ఈ సీజ‌న్1.. 40నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌గా 5 భాషలలో రానునట్లు స‌మాచారం.

గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా ల‌వ్‌స్టోరి, బంగార్రాజు చిత్రాల త‌ర్వాత నాగ చైత‌న్య స‌రైన స‌క్సెస్ లేక రేస్‌లో కాస్త వెన‌క‌బ‌డ్డాడు. మ‌ధ్య‌లో లాల్ సింగ్ చ‌డ్డా, థ్యాంక్యూ, క‌స్ట‌డీ వంటి చిత్రాలు తీవ్రంగా నిరాశ ప‌ర్చ‌డంతో ఇప్పుడు ఓ విజ‌యం త‌ప్ప‌ని స‌రిగా మారింది.

ప్ర‌స్తుతం చైత‌న్య‌ కార్తికేయ‌2 వంటి భారీ స‌క్సెస్ ఇచ్చిన చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వి జోడీగా గీతా అర్ట్స్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అనుకోకుండా స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన‌ ఈ సిరీస్ అయినా చైతూకి ఓ మంచి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

Updated Date - 2023-11-14T16:01:16+05:30 IST