Akhil Akkineni: చాలా మెచూరిటీ తో మాట్లాడిన అఖిల్

ABN , First Publish Date - 2023-04-17T11:36:12+05:30 IST

అఖిల్ అక్కినేని 'ఏజెంట్' మొదటి మీడియా సమావేశం లో చక్కగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. అన్ని ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం చెపుతూ ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Akhil Akkineni: చాలా మెచూరిటీ తో మాట్లాడిన అఖిల్

ఎంతమంది నటులు ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు అయినా కొందరు సరిగ్గా మాట్లాడలేరు. ఏదైనా ప్రశ్న అడిగితే చిరాకు పడటం, లేదా అది ఎందుకు అనటం, కోపం తెచ్చుకోవటం ఇలాంటివి చేస్తూ వుంటారు. చేసినవి నాలుగు సినిమాలు అయినా, మొన్న జరిగిన 'ఏజెంట్' (AgentOnApril28) ప్రెస్ మీట్ లో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) మాట తీరు, ప్రతి ప్రశ్నకి చెప్పిన సమాధానం, అతను మాట్లాడే విధానం, అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా మాట్లాడేడు. ప్రెస్ మీట్ అయ్యాక అది చూసిన పరిశ్రమలోని కొంతమంది అతన్ని ప్రశంసించారు కూడా.

akhilakkineniagent2.jpg

మీడియావాళ్లు సంధించిన అన్ని ప్రశ్నలకు ఎక్కడా తడబడకుండా, కోపం తెచ్చుకోకుండా అన్ని ప్రశ్నలకు తనదైన రీతిలో అఖిల్ చెప్పిన (AkhilAkkineni) సమాధానాలు అతని పరిణితి ఎంత హై గా ఉందొ చెపుతుంది. ఎంతో మెచూరుడు (Matured) గా అన్నిటికి ఆన్సర్ చేసాడు. అలాగే సినిమాకి క్రెడిట్ చాలాభాగం సురేందర్ రెడ్డి (Surender Reddy) కి ఇచ్చాడు. సినిమా డిలే అవుతున్న తన ఫిజిక్ ఒకేలా ఉండేలా ఉంచాలంటే, దానికి చాలా సాధన, ఆహార నియమం కూడా అవసరం. వాటిగురించి కూడా అడిగినప్పుడు అఖిల్ ఎంతో చక్కగా సమాధానం చెపుతూ, ఆ సినిమా మీద వున్న నమ్మకం తనని ఆలా ఉంచిందని చెప్పాడు. #AgentOnApril28

agent-akhilakkineni3.jpg

చాలామంది సీనియర్ నటులు కూడా ఒక్కోసారి సరిగ్గా మాట్లాడలేరు. కానీ నాలుగంటే నాలుగు సినిమాలు చేసిన అఖిల్ అక్కినేని మాత్రం ఎంతో అనుభవం వున్నా నటుడిలా మాట్లాడం ఆశ్చర్యం కొలిపింది. హిందీలో ఎందుకు విడుదల కావటం లేదు అనే ప్రశ్నకు, తెలుగులో హిట్ అయితే హిందీలో తరువాత విడుదల చేయొచ్చు అని, తాను ముందు తెలుగు వాడిని అని, తెలుగు నా స్వంత ఇల్లు అని చెప్పిన సమాధానం అబ్బురపరిచింది. 'కాంతారా' (Kantara) ముందు కన్నడంలోనే విడుదల అయి తరువాత పాన్ ఇండియా లో విడుదల అయిందని, అలాగే 'ఏజెంట్' కూడా అని చెప్పుకొచ్చాడు. ఏమైనా కూడా అఖిల్ మాట్లాడటం లో కూడా చాలా మెచూరిటీ చూపిస్తున్నాడు, అతని నమ్మకం 'ఏజెంట్' వమ్ము చేయదని అనుకుంటున్నారు.

Updated Date - 2023-04-17T11:36:13+05:30 IST