Aishwarya Lekshmi: ప్రేమ వార్తలపై క్లారిటీ!
ABN , First Publish Date - 2023-01-13T20:44:57+05:30 IST
‘మాస్టర్’ నటుడు అర్జున్ దాస్ (Arjun Das)తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు వస్తున్న వార్తలపై మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) స్పందించింది. ఆమె అంతకు ముందు అర్జున్ దాస్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
 
                            
‘మాస్టర్’ నటుడు అర్జున్ దాస్ (Arjun Das)తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు వస్తున్న వార్తలపై మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) స్పందించింది. ఆమె అంతకు ముందు అర్జున్ దాస్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. లవ్ సింబల్‌ను క్యాప్షన్‌గా చేర్చింది. ఈ ఫోటోను ఆధారంగా చేసుకుని పలు వెబ్‌సైట్స్ కథనాలు రాశాయి. అర్జున్‌తో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు తెలిపాయి. ఫలితంగా ఈ వార్తలపై ఆమె స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నా లాస్ట్ పోస్ట్ ఇంతలా వైరల్ అవుతుందని అనుకోలేదు. మేమిద్దరం సరదాగా కలుసుకున్నాం. ఈ సందర్భంగా ఓ ఫొటో తీసుకున్నాం. అంతకు మంచి మా మధ్య ఏం లేదు. మేం మంచి స్నేహితులం మాత్రమే’’ అని ఐశ్వర్య లక్ష్మి చెప్పింది.
ఐశ్వర్య లక్ష్మి భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేసింది. ‘గాడ్సే’, ‘అమ్ము’, ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైంది. చివరగా ‘మట్టి కుస్తీ’ లోనూ నటించింది. కుస్తీ తెలిసిన గృహిణి పాత్రలో కనిపించింది. ఇక అర్జున్ దాస్ విషయానికి వస్తే.. విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మాస్టర్ సినిమాలో మాదక ద్రవ్యాలకు బానిసైన స్టూడెంట్ పాత్రను పోషించాడు. ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాల్లోను కీలక పాత్రలు పోషించాడు. తాజాగా ‘బుట్ట బొమ్మ’ లోను నటించాడు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జనవరి 26న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.