Agent Trolling: తల్లి ప్రేమ ఎక్కడికి పోతుంది!

ABN , First Publish Date - 2023-04-29T18:38:04+05:30 IST

తన బిడ్డ అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై అక్కినేని అమల స్పందించారు. అభద్రతాభావంతో ఇలాంటి విమర్శలు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు.

Agent Trolling: తల్లి ప్రేమ ఎక్కడికి పోతుంది!
Akhil and Amala

తన బిడ్డ అక్కినేని అఖిల్‌ (akhil akkineni) నటించిన ఏజెంట్‌ (Agent) సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై అక్కినేని అమల స్పందించారు. అభద్రతాభావంతో ఇలాంటి విమర్శలు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు. ఈ మేరకు అమల ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ట్రోలింగ్‌ (Trolling on akhil) అనేది ఇన్‌సెక్యూరిటీస్‌ వల్ల వస్తుంటుంది. కానీ అది విజయానికి సాయపడుతుంటుంది. నిన్న ఏజెంట్‌ సినిమా చూశా. చాలా ఎంజాయ్‌ చేశా. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి..కానీ మీరు ఓపెన్‌ మైండ్‌తో చూేస్త కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు నేను వెళ్లిన థియేటర్‌ హౌస్‌ఫుల్‌ అయింది. అందులో ఎక్కువగా ఆడవాళ్లు, అమ్మలు, అమ్మమ్మలు, పిల్లలు ఉన్నారు. యాక్షన్‌ సీన్స్‌ వచ్చినప్పుడు వాళ్లంతా అరుపులు, కేకలతో ఎంతో ఎంజాయ్‌ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్‌ నెక్ట్స్‌ చేయబోయే సినిమా మరింత బెటర్‌గా ఉంటుంది’’ అని అమల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే అమల తన సేవా కార్యక్రమాలు మినహా పెద్దగా సోషల్‌ మీడియాతో సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి స్పందించారు. తన బిడ్డపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తట్టుకోలేక ఆమె స్పందించారని కొందరు, తల్లి ప్రేమ ఎక్కడికి పోతుంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్‌థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మొదటి షో నుంచే నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ట్రోలర్స్‌ సోషల్‌ మీడియాలో చెలరేగిపోతున్నారు.

Updated Date - 2023-04-29T18:49:25+05:30 IST