WarangalSrinu: 'లైగర్' దెబ్బకి వరంగల్ శ్రీను కనిపించటం లేదు

ABN , First Publish Date - 2023-04-24T14:11:59+05:30 IST

'లైగర్' ఫెయిల్యూర్ దెబ్బకి చాలామంది కింద పడిపోయారు, అందులో అతి తక్కువ కాలం లో డిస్ట్రిబ్యూషన్ రంగం లో పేరు తెచ్చుకున్న, వరంగల్ శ్రీను కూడా వున్నాడు. అదెలా అంటే...

WarangalSrinu: 'లైగర్' దెబ్బకి వరంగల్ శ్రీను కనిపించటం లేదు
Still from Liger

పూరి జగన్నాథ్ (Puri Jagannath), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్' (Liger) ఎంత డిజాస్టర్ మూవీ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదల తరువాత ఎన్నో వివాదాలు కూడా వచ్చాయి. ఈ సినిమా కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్, అలాగే ఈ సినిమాలో రాజకీయ నాయకులు కొంతమంది డబ్బులు పెట్టారని ఇలా ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. అలాగే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ తిరిగి తమ డబ్బులు వాపసు ఇవ్వాలని దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటి ఎదుట కూర్చొని డిమాండ్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

liger2.jpg

సుడిగాలిలా డిస్ట్రిబ్యూషాన్ రంగంలో కి వచ్చి తక్కువ టైం ఎంతో పేరు సంపాదించిన వరంగల్ (Warangal Srinu) ఈ సినిమాతో ఒక్కసారిగా డీలా అయిపోయాడు. ఇంత డిజాస్టర్ అయినా ఈ 'లైగర్' #Liger మూవీ ని వరంగల్ శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు. రూ. 90 కోట్లకు కొన్నాడు అని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమా టోటల్ ఫెయిల్యూర్ అవటంతో వరంగల్ శ్రీను #WarangalSrinu ఈ సినిమా వలన చాలా లాస్ అయ్యాడు అని వార్తలు వచ్చాయి కదా అప్పట్లో. అతను పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ లో చాలా భాగం ఈ సినిమాతో పోయింది. ఎందుకంటే అంతకు ముందు చాలా సినిమాలను ఇలా మొత్తం డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకొని విడుదల చేసాడు. కానీ 'లైగర్' కి కూడా అలానే చెయ్యడం, ఆ సినిమా ఫెయిల్ అవ్వటం తో ఆ సినిమా తరువాత వరంగల్ శ్రీను ఎక్కడ కనిపించలేదు.

warangalsrinu.jpg

దానికి తోడు అతను 'లైగర్' కన్నా ముందు 'ఆచార్య' #Acharya సినిమా కూడా తీసుకున్నాడు. చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్ లో వచ్చిన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) సినిమా ఇది. ఇది కూడా ఘోర వైఫల్యం చెందటం, తరువాత 'లైగర్' ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో తట్టుకోలేకపోయాడు శ్రీను అని పరిశ్రమలో అనుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) కూడా డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి అడుగు పెట్టడంతో ఇంకా వరంగల్ శ్రీను సినిమా డిస్ట్రిబ్యూషన్ నుండి తప్పుకున్నాడని కూడా ఒక వార్త నడుస్తోంది.

Updated Date - 2023-04-24T14:12:21+05:30 IST