సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SarathBabu: శరత్ బాబు ఆస్తి ఎవరికి, కుటుంబం ఏమంటోంది

ABN, First Publish Date - 2023-05-25T18:17:17+05:30

శరత్ బాబు చనిపోయి ఇంకా కొన్ని రోజులే అయింది, అతని దశ దిన కర్మ కూడా కాలేదు, కానీ అప్పుడే అందరికీ అతని కోట్ల విలువ చేసే ఆస్తి ఎవరికీ చెందుతుంది అనే ఆసక్తికర ప్రశ్నలు బయలుదేరాయి. అతని కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు ప్రకారం శరత్ బాబు తన ఆస్తికి వారసులను ప్రకటిస్తూ ఎప్పుడో వీలునామా రాసారు అని తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్ నటుడు శరత్ బాబు (SarathBabu) కొన్ని రోజుల క్రితమే తుది శ్వాస విడిచారు. చాలా రోజులు హాస్పిటల్ లో వుండి, పోరాడి చివరికి మే 22 వ తేదీన పరమపదించారు. శరత్ బాబు ఏకాకి. అతనికి పిల్లలు లేరు, కానీ శరత్ బాబు సుమారు 250 కి పైగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలతో పాటు ఎంతో ఆస్తి కూడా సంపాదించారు. #SarathBabuProperty అయితే అతను మొదటి సారి నటి రమాప్రభ (RamaPrabha) ని పెళ్లిచేసుకొని, ఆమెతో విడిపోయారు. తరువాత స్నేహలత (Snehalatha) అనే ఆమెని పెళ్లి చేసుకున్నారు, కానీ ఆమెతో కూడా మనస్పర్థలు వచ్చి విడిపోయారు. మూడో పెళ్లి చేసుకుంటారు అని రూమర్లు వచ్చాయి కానీ అవలేదు.

ఇదిలా ఉంటే మరి ఎవరూ లేని శరత్ బాబు ఆస్తి ఎవరికీ చెందుతుంది. ఈ ప్రశ్న ఆ కుటుంబం లో వాళ్ళ కన్నా, బయట వాళ్ళకి ఎక్కువ ఆసక్తిగా వుంది. ఎందుకంటే శరత్ బాబు కుటుంబం లో 8 మంది అన్నదమ్ములు, 5 గురు అక్కచెల్లెళ్లు. శరత్ బాబు మూడో వాడు. పెద్దన్నయ్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. అయితే శరత్ బాబు తన అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను తన దగ్గరకి తెచ్చుకునేవారు, వాళ్ళకి ఎటువంటి ఆర్ధిక సహాయం కావాలన్నా చేసేవారు.

శరత్ బాబు చెల్లెలు సరిత అనే ఆమె అయితే తన పెళ్లి, తన కూతురు పెళ్లి కూడా శరత్ బాబే చేయించారని చెప్పింది. తన కొడుకుని కూడా శరత్ బాబే చదివించాడని, అలాగే మిగతా అన్నదమ్ముల, #SarathBabuFamily అక్కాచెల్లెళ్ల సంతానాన్ని కూడా శరత్ బాబే చదివిస్తున్నారని చెప్పారు. శరత్ బాబు అన్నదమ్ములు ఇప్పుడు శరత్ బాబు దశ దిన కర్మ చేసే భాగంలో వున్నారు. మరి శరత్ బాబు ఆస్తి ఎవరికీ చెందుతుంది, ఎవరికీ వస్తుంది అన్న ప్రశ్నలతో అన్నదమ్ములను కొంతమంది మీడియా వాళ్ళు పదే పదే అడగటంతో వాళ్ళు దాని గురించి కూడా చెప్పారు.

అసలు ఇది టైము కాదు ఆస్తి గురించి మాట్లాడటానికి. కానీ అయన విల్లు ఎలా రాస్తే, ఎవరికీ రాస్తే వారికే చెందుతుంది. ఎందుకంటే ఇది మా కుటుంబ వ్యవహారం. మేము అతని ఆస్తికోసం ఏమి తగవులాడుకోము, మాది ఉమ్మడి కుటుంబం, మాకు తెలుసు ఎలా ఏమి చెయ్యాలో అని శరత్ బాబు తమ్ముడు మధు చెప్పారు. ఒక వేళ శరత్ బాబు విల్లు లాంటిది ఏమైనా రాస్తే, లాకర్లు అవి ఓపెన్ చేసి చూస్తాము, కానీ ఇప్పుడు కాదు, 12వ రోజు అయ్యాక మాత్రమే. #SarathBabuProperty మాకేమి వాటి గురించి బెంగ లేదు, ఎందుకంటే అతను ఏమైనా విల్లు రాయకపోతే మా కుటుంబం ఏమి చెయ్యాలనేది డిసైడ్ చేసుకుంటాం అని చెప్పాడు మధు. మా మధ్య విబేధాలు లేవు, వ్యక్తిగతంగా ఏంటి ఈయన అతనికి ఇచ్చేసాడు, మాకివ్వలేదు అని మేము ఏమీ అనుకోము. బ్రదర్స్, సిస్టర్స్ అంత ఒకటే, ఎవరికి ఏదిచ్చినా ఒకే, ఇవ్వకపోయినా ఒకే, అని చెప్పాడు శరత్ బాబు తమ్ముడు.

కానీ శరత్ బాబు ఎప్పుడో తన ఆస్తి మొత్తం విల్లు రాసారని, తన కుటుంబ సభ్యుల పేరు మీదే ఎవరికి ఏమి చెందుతుంది అనేది ముందుగానీ నిర్ణయించారని తెలిసింది. ఎందుకంటే అతని కుటుంబం లో సుమారు 23 మంది ఇప్పుడు వున్నారని, వాళ్లందరికీ సమ న్యాయం చేశారని తెలిసింది.

Updated Date - 2023-05-25T18:17:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!