Ramcharan: రామ్‌చ‌ర‌ణ్‌కు ‘ఆస్కార్స్’ మ‌రో గౌరవం.. యాక్ట‌ర్స్‌ బ్రాంచ్‌లో చోటు

ABN , First Publish Date - 2023-11-02T14:09:30+05:30 IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కి మ‌రో ఆరుదైన విశ్వ‌వ్యాప్త‌ గౌర‌వం ల‌భించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అద్భుత న‌ట‌న క‌న‌బ‌ర్చినందుకు గాను ప్ర‌ఖ్యాత అస్కార్స్ యాక్ట‌ర్స్‌ బ్రాంచ్‌లో చోటు క‌ల్పిస్తన్న‌ట్లు ది అకాడ‌మీ పేర్కొంది. ఈ మేర‌కు ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది.

Ramcharan: రామ్‌చ‌ర‌ణ్‌కు ‘ఆస్కార్స్’ మ‌రో గౌరవం.. యాక్ట‌ర్స్‌ బ్రాంచ్‌లో చోటు
ramcharan, the acadamy

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కి మ‌రో ఆరుదైన విశ్వ‌వ్యాప్త‌ గౌర‌వం ల‌భించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అద్భుత న‌ట‌న క‌న‌బ‌ర్చినందుకు గాను ప్ర‌ఖ్యాత అస్కార్స్ యాక్ట‌ర్స్‌ బ్రాంచ్‌లో చోటు క‌ల్పిస్తన్న‌ట్లు ది అకాడ‌మీ (The Academy) పేర్కొంది. ఈ మేర‌కు ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది. దీంతో ఈ వార్త విన్న మెగా అభిమానులు పెద్దెత్తున్న సంబురాలు చేసుకుంటున్నారు.

ntr.jpg

వారం రోజుల క్రితం విడుద‌ల చేసిన రెండో జాబితాలో జూ. ఎన్టీఆర్‌కు స్థానం ద‌క్కగా తాజాగా నిన్నటి లిస్టులో మెగాప వ‌ర్‌స్టార్ స్థానం ద‌క్కించుకున్నారు. ఈసంద‌ర్భంగా ’ఎన్నో సినిమాల్లో వారికున్న ప్ర‌త్యేక‌మైన‌ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసి వారి హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయేలా వారి పాత్ర‌ల‌కు జీవం పోస్తున్నారంటూ‘ ది అకాడ‌మీ పోస్టు చేసింది.

ram-charan.jpg

తాజాగా రామ్‌చ‌ర‌ణ్ పేరు సామ‌మాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతూ ఉంది. తెలుగు వారికి, దేశానికి ఇది గ‌ర్వ కార‌ణంగా ఉందంటూ #Ramcaharan యాష్‌ట్యాగ్‌ను ఆయ‌న అభిమానులు ఎక్స్‌లో టాప్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. జూ.ఎన్టీర్‌,రామ్‌చ‌ర‌ణ్‌కు ఆందులో చోటు క‌ల్పించి ఆకాడ‌మీ ప్ర‌త్యేక‌ గౌర‌వం ద‌క్కించుకుందంటూ మ‌రికొంత మంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు.


ఇదిలాఉండ‌గా రామ్‌చ‌ర‌ణ్( Ram Charan) నెక్ట్స్ శంక‌ర్ ద‌ర్వ‌క‌త్వంలో గేమ్‌ఛేంజ‌ర్ సినిమా చేస్తుండ‌గా కియారాఅద్వానీ(Game Changer), అంజ‌లి, శ్రీకాంత్‌, సునీల్‌,న‌వీన్‌చంద్ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొద‌టి పాట‌ను దీపావ‌ళికి విడుద‌ల చేమ‌నున్నారు. ఇక ఎన్టీఆర్ (tarak9999) కొర‌టాల శివ(KoratalaSiva) ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర(Devara) సినిమా చేస్తుండ‌గా బాలీవుడ్ శ్రీదేవి త‌న‌య జాన్వీక‌పూర్ సౌత్ ఇండ‌స్ట్రీలో అడుగు పెడుతున్న‌ది.

Updated Date - 2023-11-03T06:44:51+05:30 IST