KeedaaCola: ఎలా బతికావురా ఇన్నాళ్లూ నువ్వూ...

ABN , First Publish Date - 2023-06-28T17:33:01+05:30 IST

దాదాపు అయిదు సంవత్సరాల తరువాత దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక ఆసక్తికర అంశంతో 'కీడా కోల' అనే సినిమాతో వస్తున్నాడు. టీజర్ ఈరోజు విడుదల అయింది, ఇందులో విషయం వుంది అన్నట్టుగా వుంది, మరి సినిమా ఎలా తీసాడు చూడాలి

KeedaaCola: ఎలా బతికావురా ఇన్నాళ్లూ నువ్వూ...
Keedaa Cola

తరుణ్ భాస్కర్ (TharunBhascker) అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా టాలీవుడ్ లో బాగా రాణిస్తున్నాడు. రెండింటిలోనూ టాలెంట్ వున్న ఇతను ఇప్పుడు 'కీడా కోలా' #KeedaaColaTeaser అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకు ముందు ‘పెళ్లి చూపులు’ #PelliChoopulu, ‘ఈ నగరానికి ఏమైంది’ #ENEలాంటి యూత్ ని అట్రాక్ట్ చేసే మంచి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వచించాడు. ఈరోజు తన దర్శకుడిగా తన మూడో సినిమా ‘కీడా కోలా’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. #KeedaaColaTeaser

ఈ టీజర్ చూస్తే, తరుణ్ భాస్కర్ ఇంకో ఆసక్తికర అంశంతో ఈ సినిమా చేస్తున్నాడు అనిపిస్తుంది. టీజర్ ప్రారంభంలోనే ఒక సాఫ్ట్ డ్రింక్ సీసాని పెట్టి, బ్రహ్మానందం ఏంటిరా అది అంటే, చైతన్య అది గ్రేప్స్ ఏమో అంటే, గ్రేప్స్ ... ఎలా బతికేవురా ఇన్నాళ్లూ నువ్వు అంటూ సాగే ఆసక్తికర డైలాగుతో మొదలయింది. చివర్లో ఆ సీసాలో ఒక బొద్దింక ఇరుక్కుపోయినట్లు చూపించారు.

keedacola1.jpg

ఈ సినిమా కథ నేపధ్యం ఈ కీడా కోలా చుట్టూనే ఉండొచ్చు అనిపిస్తోంది. అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించడం బాగుంది. చివర్లో “శ్వాస మీద ధ్యాసతో.. వస్తున్నాం” అంటూ బాగానే చూపించాడు. దాదాపు అయిదు సంవత్సరాల తరువాత తరుణ్ భాస్కర్ దర్శకుడిగా చేస్తున్న సినిమా ఈ 'కీడా కోలా', #KeedaaColaTeaser కాబట్టి ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సాంఘీక మాధ్యమంలో ఈ టీజర్ ని పోస్ట్ చేస్తూ, “కష్టపడ్డాం. పాలమ్మినం. ఇక అంతా మీదే.” అని అన్నాడు.

Updated Date - 2023-06-28T18:10:18+05:30 IST