Prabhas: ఏంటిరా బాబూ ఇతనికి ఇన్ని కష్టాలు

ABN , First Publish Date - 2023-03-08T14:06:06+05:30 IST

ప్రభాస్ ఇప్పుడు నాలుగు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తున్నాడు, అందులో చాల సినిమాలు విడుదల తేదీలు ప్రకటించినా, కానీ కొంచెం డిలే ఐయ్యే పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే...

Prabhas: ఏంటిరా బాబూ ఇతనికి ఇన్ని కష్టాలు

అగ్రనటులు ఎవరయినా ఏడాదిలో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే ఈరోజుల్లో, ప్రభాస్ (Prabhas) ఏకంగా నాలుగు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తున్నాడు. పోనీ అందులో ఒకటయిన పూర్తి అయిందా అంటే ఒక్కటి కూడా పూర్తి అవలేదు, ఒక సినిమా అయింది అనుకుంటే, దాని మీద విమర్శలు రావటం తో దాన్ని మళ్ళీ రీషూట్ చేస్తున్నారు అని అంటున్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాలు, అవి ఏ దశలో ఉన్నాయో ఒక్కసారి చూస్తే, ప్రభాస్ కి ఏంటి ఈ కష్టాలు అని అనిపిస్తూ ఉంటుంది.

adipurush1.jpg

'ఆదిపురుష్' (Adipurush) సినిమా టీజర్ విడుదల అయింది అనుకుంటే, అందులో రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ని మలిచిన తీరు ప్రేక్షకులకి నచ్చలేదు. విపరీతంగా ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. దానితో ఆ సినిమా మళ్ళీ చాలా వర్క్ చేస్తున్నారు అని తెలిసింది. అది యానిమేషన్ కూడా అవడంతో ఇప్పట్లో విడుదల అయ్యే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఓం రౌత్ (Om Raut) దీనికి దర్శకుడు కాగా, కృతి సనన్ (Kriti Sanon) ఇందులో కథానాయిక. ఇదిలా ఉంటే ఆ టీజర్ విడుదల అయిన దగ్గర నుంచి ప్రభాస్, కృతి సనన్ మధ్య ఎదో ఉందని సాంఘీక మాధ్యమాల్లో ఒకటే వార్తలు. పాపం ప్రభాస్ అనుకున్నారు. ఆదిపురుష్ టీజర్ విడుదలకి ఒక నెల ముందు ప్రభాస్ కి వెన్నుముఖలా వున్న అతని పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) గారు పోయారు. ఆదిపురుష్ అలా వెనకపడిపోయింది.

adipurush2.jpg

దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో 'సాలార్' (Salaar) అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇది పూర్తి అయిపోవచ్చింది అంటున్నారు కానీ, ఎంతవరకు అయిందో ఒక్క ఆ చిత్ర నిర్వాహకులకు మాత్రమే తెలుసు. ఈ సినిమా 'ఆదిపురుష్' విడుదల అయిన తరువాతే విడుదల చెయ్యాలి అని ప్రభాస్, అలాగే చిత్ర నిర్వాహకులు కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమా నుండి ప్రభాస్ లుక్ గానీ, వేరే ఏదైనా గానీ అభిమానులు అడుగుతున్నారు, ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. ఈ సినిమా కూడా కొంచెం డిలే ఉంటుంది అని అంటున్నారు. ఇది రెండు పార్టులు వస్తుంది అని అంటున్నారు. మరి మొదటి పార్టులో ఎంతవరకు పెట్టాలి అనే విషయం మీద చర్చ నడుస్తోంది అంటున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల ఉంటుంది అన్నారు, కానీ ఆ టైం కి విడుదల ఉంటుందా అని అనుకుంటున్నారు.

prabhas-projectk.jpg

ఇంక మూడో సినిమా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం లో వస్తున్న 'ప్రాజెక్ట్ కె' (ProjectK). ఈ సినిమా షూటింగ్ లో లెజెండరీ నటుడు అయిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గాయపడ్డానంటూ తన స్వంత బ్లాగ్ లో పెట్టారు. అయితే ఈ సినిమా నిర్మాత మాత్రం అమితాబ్ మా సినిమా షూటింగ్ లో గాయపడలేదు, మూడు రోజుల ముందే వెళ్లిపోయారు అంటూ ఒక ప్రకటన చేశారు. ఇందులో ఎంతవరకు, ఎవరిదీ నిజమో తెలీదు. కానీ సినిమా షూటింగ్ లో అయితే ఇప్పుడిప్పుడే పాల్గొనే అవకాశం లేదు అని అమితాబ్ చెప్పేసారు. అందువల్ల, ఈ సినిమా అమితాబ్ చేయబోయే సన్నివేశాల కోసం ఆగాల్సిందే. ఇది ఎలాగు ఇప్పట్లో అయ్యే సినిమా కూడా కాదు. అందువల్ల ఇది పూర్తయ్యే సమయం వరకు క్లారిటీ రాదు.

prabhas-adipurush1.jpg

నాలుగో సినిమా దర్శకుడు మారుతీ (Director Maruthi) తో చేస్తున్నది. మధ్య మధ్య లో ప్రభాస్ వచ్చి ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. కానీ ఇది ఎంతవరకు అయింది, ఏమి అయింది, ఈ సినిమా ఎలా వుండబోతోంది అనే విషయం మాత్రం ఏమి సమాచారం లేదు. మారుతి చేస్తున్న స్పీడ్ బట్టి ఇది తొందరగా పూర్తి అయ్యే అవకాశం వుంది. లేట్ గా మొదలెట్టినా, ఈ సినిమాలో గ్రాఫిక్స్, యానిమేషన్, లేదా ఇతరత్రా చాలా కష్టమయిన సన్నివేశాలు అలాంటివి లేకపోతే, ఇదే తొందరగా పూర్తయ్యే అవకాశం కూడా వుంది. మరి ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయొచ్చు.

ఈ నాలుగు సినిమాలతో బిజీ గా వున్న ప్రభాస్, నాలుగు సినిమాలని కూడా కొంచెం కొంచెం షూటింగ్ చేస్తూ పూర్తి చేస్తున్నాడు. కానీ ఈ ఏ సినిమాకి ఆ సినిమానే ఎదో ఒక కష్టాల్లో ఉంటూ, ప్రభాస్ ని కూడా కాస్థల్లో పెడుతోంది. ఇలా నాలుగు సినిమాలు ఒకేసారి చెయ్యడం వలన వచ్చే ప్రాబ్లెమ్ ఇదేనేమో.

ఇది కూడా చదవండి:

అందరినీ ఉర్రూతలూగించే ఆమె నిజ జీవితంలో కథ వింటే షాక్ అవుతారు

Updated Date - 2023-03-08T14:07:13+05:30 IST