Kamal Haasan: కలల చిత్రం కొన్ని మార్పులతో మళ్లీ సెట్స్‌ మీదకు?

ABN , First Publish Date - 2023-03-31T10:53:14+05:30 IST

‘విక్రమ్‌’ సినిమాతో సక్సెస్‌ బాటలో పడ్డారు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌. ప్రస్తుతం ఇండియన్‌ -2 చిత్రంతో బిజీగా ఉన్నారు. కమల్‌హాసన్‌కు ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది.

Kamal Haasan: కలల చిత్రం కొన్ని మార్పులతో మళ్లీ సెట్స్‌ మీదకు?

విక్రమ్‌’ (Vikram) సినిమాతో సక్సెస్‌ బాటలో పడ్డారు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌. ప్రస్తుతం ఇండియన్‌ -2 (Indian 2) చిత్రంతో బిజీగా ఉన్నారు. కమల్‌హాసన్‌కు (Kamal Haasan Dream project) ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది. ఆయన కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో ‘మరుదనాయగన్‌’ (Marudhanayagam) టైటిల్‌తో 1997లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఎంజీఆర్‌ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి శివాజీగణేశన్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. నవలా రచయిత సుజాతతో కలిసి హిస్టారికల్‌ (kamal haasan Historical story) డ్రామాగా కమల్‌ రాసిన కథ ఇది. అమ్రిష్‌పూరి, విష్ణువర్ధన్‌, నజీరుద్దీన్‌ షా కీలక పాత్రధారులుగా షెడ్యూల్‌ వేసుకున్నారు. ఇళయరాజా సంగీతం. 26 ఏళ్ల కిత్రమే ఈ చిత్రానికి రూ.80 కోట్లు బడ్జెట్‌తో ప్లాన్‌ చేశారు. 40 నిమిషాల నిడివి షూటింగ్‌ పూర్తి అయ్యింది.అయితే ఈ చిత్రం కొంత షూటింగ్‌ అయ్యాక ఆగిపోయింది. ఓ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరించినా షూటింగ్‌ ముందుకెళ్లలేదు. బడ్జెట్‌ తదితర అంశాలు దీనికి కారణమని చెబుతారు. (after 26 year)

ఎన్నో సందర్భాల్లో ఈ చిత్రం గురించి కమల్‌ ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు ఆయన ఈ చిత్రంపై దృష్టి పెట్టారు. 40 నిమిషాల నిడివి చిత్రీకరించిన ఈ సినిమాను 26 ఏళ్ల తరువాత బూజు దులిపి మళ్లీ సెట్స్‌ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నట్లు తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కమల్‌హాసన్‌ పాత్రలో విక్రమ్‌ను నటింపజేేస ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిత్రీకరించిన కమల్‌ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండేలా కథనాన్ని మార్చుతున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో చారిత్రాత్మక కథలతో వచ్చిన ‘బాహుబలి’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ తదితర చిత్రాలు విజయం సాధించడం, ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కడంతో ‘మరుదనాయగన్‌’ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో కమల్‌ ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated Date - 2023-03-31T11:04:34+05:30 IST