Adipurush - Tribeca: ఆదిపురుష్‌ సినిమా కాదు.. ఎమోషన్‌!

ABN , First Publish Date - 2023-04-18T23:19:06+05:30 IST

ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush) గ్లోబల్‌ వేదికపై సందడి చేయనుంది.

Adipurush  - Tribeca: ఆదిపురుష్‌ సినిమా కాదు.. ఎమోషన్‌!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush) గ్లోబల్‌ వేదికపై సందడి చేయనుంది. ఓంరౌత్‌ దర్శకత్వంలో భూషణ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం నూయార్క్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ట్రిబెకా ఫెస్టివల్‌లో (Tribeca Festival, Newyork) జూన్‌ 13న ప్రీమియర్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్రం బృందం మంగళవారం సాయంత్రం వెల్లడించింది. ఆదిపురుష్‌ జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నూయార్క్‌లో జూన్‌ 7 నుంచి 18 వరకూ జరిగే ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని ట్రిబెకా జ్యూరీ నిర్ణయించింది.

ఈ మేరకు దర్శకుడు ఓంరౌత్‌ ( Om Raut) మాట్లాడుతూ ‘‘ఆదిపురుష్‌’ సినిమా మాత్రమే కాదు. ఒక ఎమోషన్‌, భారతీయుల సెంటిమెంట్‌. ట్రిబెకా ఫెస్టివల్‌లో మా సినిమా ప్రదర్శించబోతుండడం మాకు దక్కిన గౌరవం’’ అని అన్నారు. దీనిపై ప్రభాస్‌ స్పందించారు.

‘‘ఆదిపురుష్‌’ ట్రిబెకా ఫెస్టివల్‌లో వరల్డ్‌ ప్రీమియర్‌ కావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మన దేశ నైతికతకు అద్దం పట్టే చిత్రంలో నేనూ భాగం కావడం ఆనందంగా ఉంది. నా మనసుకి బాగా దగ్గరైన కథ ఇది. గ్లోబల్‌ వేదికపై ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో అని ఆతురతగా ఎదురుచూస్తున్నా’’.అని అన్నారు.

రామాయణం (Ramayana) ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతీసనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా నటిస్తున్నా. త్రీడీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.. సిరీష్‌ భూషణ్‌కుమార్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 16న సినిమాను విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-04-18T23:19:37+05:30 IST