Adipurush: మహిమాన్విత మంత్రం నీ నామం!

ABN , First Publish Date - 2023-04-22T11:03:48+05:30 IST

ప్రభాస్‌(Prabhas), కృతీసనన్‌ (Krithisanon) జంటగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓంరౌత్‌ దర్శకత్వంలో టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Adipurush: మహిమాన్విత మంత్రం నీ నామం!

ప్రభాస్‌(Prabhas), కృతీసనన్‌ (Krithisanon) జంటగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓంరౌత్‌ దర్శకత్వంలో టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ‘జై శ్రీరాం’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను ఐదు భాషల్లో విడుదల చేశారు. సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. భక్తి పాటలు కంపోజ్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న ఈ మ్యూజికల్ ద్వయం మరోసారి అద్భుతమైన ట్యూన్ తో ఆకట్టుకున్నారు. అలాగే మోషన్‌ పోస్టర్‌ను ట్విట్టర్‌ వేదికగా ఆవిష్కరించిందీ చిత్ర బృందం. (Om Raut)

‘‘నీ సాయం,, సదా మేమున్నాం..

సిద్ధం సర్వ సైన్యం

సహచరులై పదా వస్తున్నాం..

సఫలం స్వామి కార్యం..

మా బలమేదంటే

నీపై నమ్మకమే

తలపున నువ్వుంటే

సకలం మంగళమే..

మహిమాన్విత మంత్రం నీ నామం.. (jai sriram lyrical video)

జైశ్రీరాం.. జైశ్రీరాం.. జైశ్రీరాం.. రాజారామ్‌’’ అంటూ సాగే 60 సెకెన్ల లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ప్రభాస్‌ రాముడిగా, కృతీససన్‌ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా కనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని జూన్‌ 16న విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-04-22T11:40:03+05:30 IST