Adipurush: పడిపోయిన కలక్షన్స్, నష్టాల్లోకి వెళుతున్న ప్రభాస్ సినిమా?

ABN , First Publish Date - 2023-06-22T10:55:13+05:30 IST

సోమవారం నుండి 'ఆదిపురుష్' కలెక్షన్స్ బాగా పడిపోయాయి. నిన్న అయితే మొత్తం సింగల్ డిజిట్ కలెక్షన్స్ మాత్రమే దేశం అంతటా కలిపి చూపిస్తోంది. సుమారు రూ.500 కోట్ల పైనే బడ్జెట్ తో తీసిన ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలూ తెచ్చే అవకాశం వుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Adipurush: పడిపోయిన కలక్షన్స్, నష్టాల్లోకి వెళుతున్న ప్రభాస్ సినిమా?
Adipurush

ఈమధ్య కాలంలో బాగా విమర్శలకు తావిచ్చిన సినిమా ప్రభాస్(Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన 'ఆదిపురుష్' #Adipurush. ఓం రౌత్ (OmRaut) దీనికి దర్శకుడు, రామాయణం (Ramayanam) ప్రాతిపదికగా తీసిన సినిమా ఇది అని చిత్ర నిర్వాహకులు చెప్పారు. అయితే ఈ సినిమా విడుదల అయిన వెంటనే, ఈ సినిమాలోని మాటలు, పాత్రల చిత్రీకరణ, సన్నివేశాలు అన్నీ విమర్శలకు లోనయ్యాయి. #Ramayanam అందరికీ తెలిసిన రామాయణం కాకుండా, దర్శకుడు ఓం రౌత్, తనకి నచ్చిన రామాయణ పాత్రలతో అతని తెరకెక్కించే తీరు ఎవరూ హర్షించలేదు.

Adipurush-1.jpg

అలాగే దీనికి మాటలు రాసిన మనోజ్ ముంతషీర్ శుక్ల (ManojMuntashirShukla) ని ప్రేక్షకులు ఒక రకంగా కాదు, పరి పరి విధాలా విమర్శిస్తూనే వున్నారు. "తైలం నీ బాబుది, గుడ్డముక్క నీ బాబుది, నిప్పు నీ బాబుది, మరి కాలేది కూడా నీ బాబుదే", ఇది హనుమంతుడు లంకా దహనం ముందు తోకకి నిప్పు పెట్టినప్పుడు చెప్పే డైలాగ్. హిందీ డైలాగ్ కి తెలుగు సినిమాలో డైలాగ్ ఇలా రాసారు. అంటే హిందీలో ఇంకెంత ఘోరంగా రాశాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో దేవదత్త నగె (DevdattaNage) హనుమంతుడిగా వేస్తె, సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) రావణుడిగా కనిపిస్తాడు.

ఇలాంటి మాటలు సినిమా నిండా వున్నాయి, వీటన్నిటినీ విమర్శిస్తున్నారు ప్రేక్షకులు. ఆసక్తికరం ఏంటంటే #Adipurush ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా బాగోలేదు, సరిగ్గా తీయలేదు అని చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో కంప్యూటర్ గ్రాఫిక్స్, పాత్రలను చూపించే విధానం అస్సలు నచ్చలేదు #AdipurushControversy ప్రేక్షకులకి. అందుకని ఈ సినిమా కలెక్షన్స్ సోమవారం నుండి పడిపోయాయి.

kritisanonSita1.jpg

ఇప్పుడు రోజువారీ కలెక్షన్స్ మొత్తం భారతదేశం అంతా కలిపితే సింగల్ డిజిట్ కి వచ్చేసింది అంటున్నారు. ఇంతవరకు మొత్తం రూ.250 కోట్లు మాత్రమే కలెక్టు చేసిందని, ఇలా బాడ్ టాక్ రావటంతో ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం లేదని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. ఇలాగే కనక కొనసాగితే చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు.

నైజాం ఏరియా (NizamArea) ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) రూ. 50 కోట్ల కు కొన్నారని తెలిసింది, ఇంతవరకు సుమారు 30 కోట్లకి పైగా కలెక్టు చేసిందని, ఇంక ఇప్పుడు కలెక్షన్స్ దేశం అంతా పడిపోయాయి కాబట్టి, ఇక్కడ సుమారు పది కోట్ల కి పైగా నష్టం వాటిల్లవచ్చని అంచనాలు వేస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో వాళ్లకి కూడా నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. ఈ సినిమాకి మంచి హైప్ రావటంతో, చాలా ఎక్కువ రేట్స్ కి ప్రతి ఏరియాలో అమ్మేసారు అని చెపుతున్నారు. కొనుక్కున్నవాళ్లకే నష్టం కానీ, నిర్మాతకి ఉండకపోవచ్చు ఎందుకంటే నష్టం వస్తే డబ్బులు ఇచ్చే క్లాజు పెద్ద స్టార్స్ కి ఉండదు. అందుకని కొనుక్కున్న వాళ్ళకి ఎంత వస్తే అంత వచ్చినంత మహాదేవ అని అంటున్నారు.

Updated Date - 2023-06-22T10:55:13+05:30 IST