Rudhiraksha : ఆది సాయికుమార్‌ కొత్త సినిమా షురూ!

ABN , First Publish Date - 2023-12-15T14:50:25+05:30 IST

ఆది సాయికుమార్‌ (Adi sai kumar) హీరోగా, జె.చి.చక్రవర్తి (JD.Chakravarthi), సత్యరాజ్‌ (Satya raj) కీలక పాత్రల్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రుధిరాక్ష’ (Rudhiraksha). శివ శంకర్‌ దేవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజు జువ్వల నిర్మిస్తున్నారు.

Rudhiraksha : ఆది సాయికుమార్‌ కొత్త సినిమా షురూ!

ఆది సాయికుమార్‌ (Adi sai kumar) హీరోగా, జె.చి.చక్రవర్తి (JD.Chakravarthi), సత్యరాజ్‌ (Satya raj) కీలక పాత్రల్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రుధిరాక్ష’ (Rudhiraksha). శివ శంకర్‌ దేవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజు జువ్వల నిర్మిస్తున్నారు. డార్క్‌, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం శుక్రవారం రామానాయడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్‌ కొట్టగా రామ్‌ తాళ్లూరి కెమరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు దేవ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హై బడ్జెట్‌, టాప్‌ టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘యానిమల్‌’ ఫేం హర్షవర్షన్‌ రామేశ్వర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభం కానుందని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-12-15T14:50:59+05:30 IST