Megha Akash: రాజకీయ నాయకుడి కుమారుడితో..?

ABN , First Publish Date - 2023-06-08T15:50:18+05:30 IST

‘లై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కథానాయిక మేఘా ఆకాశ్‌. త్వరలో ఈ చెన్నై బ్యూటీ పెళ్లి పీటలెక్కనున్నట్లు కోలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది. కన్యాకుమారికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త, వ్యాపారవేత్త కొడుకును మేఘా ఆకాష్‌ పెళ్లి చేసుకోనుందట

Megha Akash: రాజకీయ నాయకుడి కుమారుడితో..?

‘లై’ (Lie fame) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కథానాయిక మేఘా ఆకాశ్‌ (megha Akash). త్వరలో ఈ చెన్నై బ్యూటీ పెళ్లి పీటలెక్కనున్నట్లు కోలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది. కన్యాకుమారికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త, వ్యాపారవేత్త కొడుకును మేఘా ఆకాష్‌ పెళ్లి చేసుకోనుందట. మేఘా కొంతకాలంగా అతనితో ప్రేమలో ఉందని, ఇటీవల ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకారం తెలిపారని భోగట్టా. ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే నిశ్చితార్థం ఏర్పాట్లు కూడా జరగనున్నాయని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మేఘా ఆకాశ్‌ నుంచి, ఆమె సిబ్బంది నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. (Actress megha akash)

‘లై’తో కథానాయికగా పరిచయమైనా ఆమె ‘ఛల్‌ మోహన్‌రంగా’, ‘రాజ రాజ చోర’, ‘డియర్‌ మేఘ’, ‘ప్రేమదేశం’, ‘రావణాసుర’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె కీలక పాత్రలో నటించిన ‘భూ’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. వరుస అవకాశాలు అందుకున్నా కెరీర్‌లో ఇప్పటివరకు సరైన సక్సెస్‌ అందుకోలేకపోయింది. రజనీకాంత్‌, సల్మాన్‌ఖాన్‌లాంటి హీరోలు కూడా ఆమెకు సక్సెస్‌ ఇవ్వలేకపోయారు. తర్వాత నిర్మాతగా కూడా మారింది. తల్లితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఈ ఏడాది మేఘా ఆకాష్‌ చాలా బిజీగా ఉంది.

Updated Date - 2023-06-08T15:50:46+05:30 IST