సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?

ABN, First Publish Date - 2023-02-21T22:01:59+05:30

ఈ కథ చెబుతున్నప్పుడే డైరెక్టర్‌‌గారు నాకు ఆ క్యారెక్టర్‌ ఎలా మాట్లాడుతుంది.. ఎలా బిహేవ్‌ చేస్తుంది అని ప్రాక్టికల్‌గా చేసి కూడా చూపించారు. అంతగా మా కంటే

Actress Meena
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ (Organic Mama Hybrid Alludu). నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌, మీనా (Meena) ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన (Koneru Kalpana) నిర్మిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌ (Sohel), మృణాళిని రవి (Mrinalini Ravi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చిలో ఈ సినిమా విడుదల కాబోతుండగా.. ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో నటి మీనా (Actress Meena) మాట్లాడుతూ.. ఈ కథ చెబుతున్నప్పుడే డైరెక్టర్‌‌గారు నాకు ఆ క్యారెక్టర్‌ ఎలా మాట్లాడుతుంది.. ఎలా బిహేవ్‌ చేస్తుంది అని ప్రాక్టికల్‌గా చేసి కూడా చూపించారు. అంతగా మా కంటే కృష్ణారెడ్డిగారే ఈ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ అయిపోయారు. నాకు ఇది కొత్త క్యారెక్టర్‌గానే చెప్పాలి. రాజేంద్రప్రసాద్‌‌గారితో 30 సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. కృష్ణారెడ్డిగారితో వర్క్‌ చేయాలని చాలాసార్లు అనుకున్నా డేట్స్‌ ప్రాబ్లమ్‌తో కుదరలేదు. ఆయన శుభలగ్నం సినిమా ఏదైనా భాషలోకి రీమేక్‌ చేస్తే నేను చేస్తాను అని ఆయనని అడిగాను. కానీ కుదరలేదు. ఇక రాజేంద్రప్రసాద్‌‌గారు గ్రేట్‌ యాక్టర్‌.. గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్‌ కూడా. నేను తొలిసారిగా ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో పనిచేస్తున్నాను. ఆమెతో చాలా మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరం కలిసి షాపింగ్‌కు కూడా వెళ్లేంత చనువు ఏర్పడింది. ఇలాంటి మంచి సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. (Meena Speech)

ఇవి కూడా చదవండి:

Rajendra Prasad: ఇది సంస్కారవంతమైన కేటగిరీకి చెందిన సినిమా

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Updated Date - 2023-02-21T22:02:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!