Dimple Hayathi: పెట్రోల్ ఫ్రీగా రావటం లేదు, ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ, ప్రశ్నించిన డింపుల్

ABN , First Publish Date - 2023-07-20T12:11:23+05:30 IST

కొన్నిరోజుల క్రితం ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, నటి డింపుల్ హయతి వాళ్లిద్దరూ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పార్కింగ్ లో జరిగిన చిన్న తగాదాల వలన ఆ డీసీపీ, డింపుల్ మీద కేసు ఫైల్ చేసి ఆమెని ఇబ్బందిగి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వర్షాలతో హైద్రాబాదు నగరం ట్రాఫిక్ స్థంభించిపోతుంటే ఎక్కడ ట్రాఫిక్ డీసీపీ అని డింపుల్ ప్రశ్నిస్తోంది.

Dimple Hayathi: పెట్రోల్ ఫ్రీగా రావటం లేదు, ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ, ప్రశ్నించిన డింపుల్
Dimple Hayati and Rahul Hegde

కొన్ని రోజుల క్రితం నటి డింపుల్ హయతి (DimpleHayathi) ఒక వివాదంలో వున్న సంగతి తెలిసిందే కదా. డింపుల్ వున్న అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్న రాహుల్ హెగ్డే (RahulHegde) అనే ట్రాఫిక్ డీసీపీకి (TrafficDCP) మధ్య పార్కింగ్ వివాదం వచ్చినప్పుడు డింపుల్ తన వెహికల్ ని డేమేజ్ చేసింది అని ఆ ట్రాఫిక్ డీసీపీ జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ (JubileeHillsPoliceStation) లో కేసు పెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. దానికి డింపుల్ కూడా సరైన సమాధానం చెప్పింది కూడా. ట్రాఫిక్ డీసీపీ పవర్ వుంది కదా అని అపార్ట్మెంట్ సెల్లార్ పార్కింగ్ లో రోడ్ మీద వేయాల్సిన సిమెంట్ దిమ్మలు తెచ్చి అపార్ట్మెంట్ పార్కింగ్ లో పెట్టి అందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నాడని డింపుల్ లాయర్ చెప్పిన సంగతి కూడా అందరికీ తెలుసు.

Dimple-2.jpg

ఆ విషయం ఆలా ఉంటే, గత రెండు రోజుల నుండి హైదరాబాద్ నగరం వర్షాలతో (RainshitHyderabadCity) ఎక్కడపడితే అక్కడ నీరు నిల్వ వుండి జన జీవనానికి ఇబ్బందిగా మారింది. ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ లతో నగరంలో భారీగా వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆగిపోయాయి. ట్రాఫిక్ కి విపరీతమైన అంతరాయం కలిగింది కూడా. డింపుల్ కూడా ఎక్కడికో వెళ్లి తన ఇంటికి తిరిగి వెళుతూ దుర్గం చెరువు ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ లో చిక్కుకుంది. గంటలకొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇంటికి వెళ్లేసరికి చాలా లేట్ అయినట్టుగా కనపడుతోంది.

ఇదే అదునుగా ఆమె వెంటనే తన ట్విట్టర్ లో ట్రాఫిక్ రోజు రోజుకీ మరీ దారుణంగా తయారవుతోంది, ఇంటికి వెళ్ళడానికి గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది, అసలు ఈ ట్రాఫిక్ డీసీపీలు అందరూ ఎక్కడున్నారు? ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏంటి పరిస్థితి? అసలు హైదరాబాద్ లో బయటకి అడుగుపెట్టే పరిస్థితి ఉందా? పెట్రోల్ మాకు ఫ్రీగా రావటం లేదు ప్రభుత్వం వారూ? అని ప్రశ్నించింది. ఇప్పుడు అర్థం అయింది కదా ఆమె ఈ సమయంలో ఎవరిని అడుగుతోందో? మరి దీనికి అప్పుడు ఆమె మీద కేసు పెట్టిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఏమి సమాధానం చెపుతాడో చూడాలి.

Updated Date - 2023-07-20T12:11:23+05:30 IST