Extra Ordinary Man: నితిన్‌కు.. దోనీ ఎక్ట్స్రార్టీనరి గిఫ్ట్

ABN , First Publish Date - 2023-11-29T12:57:02+05:30 IST

నితిన్ ,శ్రీలీల జంటగా స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకతంలో వస్తున్న కొత్త సినిమా ఎక్ట్స్రార్టీనరి మ్యాన్. ఇప్పటికే చిత్ర యూనిట్‌ సినిమా ప్రచార కార్యక్రమాలు చేస్తున్న సమయంలో హీరో నితిన్‌కు అనుకోని అతిథి నుంచి ఓ సర్ప్రైజ్ బహుమతి వ‌చ్చింది. దీంతో అ ఆనందాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

Extra Ordinary Man: నితిన్‌కు.. దోనీ ఎక్ట్స్రార్టీనరి గిఫ్ట్
dhoni, nithin

నితిన్(nithiin) ,శ్రీలీల జంటగా స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకతంలో వస్తున్న కొత్త సినిమా ఎక్ట్స్రార్టీనరి మ్యాన్ (Extra Ordinary Man). ఇటీవలే విడుదలైన చిత్రంలోని పాటలకు మంచి స్పందన రాగా తాజాగా విడుదలైన ట్రైలర్ కు ప్రపంచవ్యాప్తంగా ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తున్నది. అంతేకాక సినిమా విడుదల కాకముందే బ్లాక్బస్టర్ హిట్ జాబితాలో చేర్చారు.


ఇప్పటికే చిత్ర యూనిట్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించి ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున్న చేస్తున్న సమయంలో హీరో నితిన్‌కు అనుకోని అతిథి నుంచి ఓ సర్ప్రైజ్ బహుమతి వ‌చ్చింది. దీంతో అ ఆనందాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

ఇండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ధోనీ(ms dhoni) నితిన్ కంగ్రాట్యులేష‌న్స్ చెబుతూ త‌న సంత‌కం చేసిన ఓ టీష‌ర్ట్‌ను పంపాడు. ఈ సంద‌ర్భంగా నితిన్ ఎక్ట్స్రార్టీనరి మ్యాన్ నుంచి ఎక్ట్స్రార్టీనరి గిఫ్ట్ సామాజిక మాధ్యాల్లో ఫొటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న‌ది.

Updated Date - 2023-11-29T12:58:38+05:30 IST