Chandra Mohan : కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి!

ABN , First Publish Date - 2023-11-13T15:27:47+05:30 IST

ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం అపోలో ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే! సోమవారం ఆయన అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో జరిగాయి.

Chandra Mohan : కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి!


ప్రముఖ నటుడు చంద్రమోహన్ (chandra Mohan funerals) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం అపోలో ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే!  సోమవారం ఆయన అంత్యక్రియలు  పంజాగుట్టలోని శ్మశాన వాటికలో జరిగాయి. చంద్రమోహన్‌ సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తొలుత ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్‌కు కడసారి వీడ్కోలు పలికారు. అభిమాన నటుడి కడసారి చూపు కోసం అభిమారులు భారీగా తరలివచ్చారు.

అంతిమయాత్రకు ముందు పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్‌కు నివాళులర్పించారు. వెంకటేశ్‌, రాజశేఖర్‌, జీవిత, నిర్మాత ఆదిశేషగిరిరావు, మాదాల రవి తదితరులు చంద్రమోహన భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు.  (Chandra mohan Final journey)

Updated Date - 2023-11-13T16:17:28+05:30 IST