Allu Ramesh: నటుడు అల్లు రమేష్‌ ఇకలేరు!

ABN , First Publish Date - 2023-04-18T13:22:23+05:30 IST

తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకొంది. రంగస్థల నటుడు, కమెడియన్‌ అల్లు రమేశ్‌ కన్నుమూశారు.

Allu Ramesh: నటుడు అల్లు రమేష్‌ ఇకలేరు!

తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకొంది. రంగస్థల నటుడు, కమెడియన్‌ అల్లు రమేశ్‌ (Allu Ramesh) కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్టణంలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులతోపాటు యువ దర్శకుడు ఆనంద్‌ రవి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. వైజాగ్‌కు చెందిన అల్ల్లు రమేశ్‌ నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయన నటించిన తొలి సినిమా 'చిరుజల్లు'. తోలు బొమ్మలాట, మధుర వైన్స్‌ , వీధి, బ్లేడ్ బాబ్జి వంటి చిత్రాలతో పాటు దిల్‌ రాజు నిర్మించిన ‘కేరింత’ (Kerintha)చిత్రంలో నూకరాజుకు తండ్రిగా ఆయన నటించారు.

ఇటీవల విడుదలైన ‘నెపోలియన్‌’లో ఓ కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఆ పాత్ర చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. రాజేంద్రప్రసాద్ "అనుకోని ప్రయాణం" అల్లు రమేష్ నటించగా విడుదలైన ఆఖరి చిత్రం. చేసింది చిన్నచిన్న పాత్రలే అయినా కోస్తా యాసతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మావిడాకులు’ వెబ్‌ సిరీస్‌లో సందడి చేశారు. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. అల్లు రమేశ్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. (Allu Ramesh passes away).

123.jpg

Updated Date - 2023-04-18T18:41:59+05:30 IST