కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Daggubati Abhiram: ప్రత్యూష మెడలో మూడు ముళ్లు వేశాడు!

ABN, First Publish Date - 2023-12-07T15:35:32+05:30

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు (D Sureshbabu)తనయుడు అభిరామ్‌(Abhiram) ఓ ఇంటివాడయ్యారు. దగ్గుబాటి కుటుంబానికి అత్యంత దగ్గర బంధువుల అమ్మాయి ప్రత్యూషను ఆయన వివాహం చేసుకున్నారు.

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు (D Sureshbabu)తనయుడు అభిరామ్‌(Abhiram) ఓ ఇంటివాడయ్యారు. దగ్గుబాటి కుటుంబానికి అత్యంత దగ్గర బంధువుల అమ్మాయి ప్రత్యూషను ఆయన వివాహం చేసుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వివాహ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్‌ వేదికైంది. కుటుంబ సభ్యులు, కొందరు అతిథుల సమక్షంలో అభిరామ్‌, ప్రత్యూష మెడలో మూడు ముళ్లూ వేశారు. శ్రీలంక నుంచి తిరిగొచ్చాక హైదరాబాద్‌లో రిసెప్షన ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

'అహింస' చిత్రంతో అభిరామ్‌ హీరోగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తనని హీరోగా చూడాలనే రామానాయుడు కోరిక ఆయన ఈ చిత్రంతో తీర్చారు. ఈ ఏడాది జూనలో విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ కాలేకపోయింది.

Updated Date - 2023-12-07T15:52:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!