సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aamani Shocking Comments: నచ్చిన విధంగా ఉండాలంటూ.. ఒంటరిగా రమ్మనేవారు!

ABN, First Publish Date - 2023-02-23T13:36:11+05:30

‘చందమామ’ కథలు చిత్రంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు ఆమని(Aamani). ప్రస్తుతం ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చక్కని అవకాశాలు అందుకుంటున్నారు. కెరీర్‌లో తనకు ఎదురైన కష్టాలు అవమానాలను ఆమె గుర్తు చేసుకున్నారు. (Senior actress Aamani Fire) సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కొందరు చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చందమామ’ కథలు చిత్రంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు ఆమని(Aamani). ప్రస్తుతం ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చక్కని అవకాశాలు అందుకుంటున్నారు. కెరీర్‌లో తనకు ఎదురైన కష్టాలు అవమానాలను ఆమె గుర్తు చేసుకున్నారు. (Senior actress Aamani Fire) సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కొందరు చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పకొచ్చారు. అవకాశాలు ఇచ్చేందుకు కొంతమంది తమకు నచ్చిన విధంగా ఉండాలని కోరారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా చెప్పిన చోటుకి రమ్మన్న వారూ ఉన్నారంటే కంటతడిపెట్టారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్‌ విషయాలు చెప్పుకొచ్చారు. (Aamani shockng comments)

‘‘మా నాన్న సినిమా డిస్ట్రిబ్యూటర్‌. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. నటిగా ఉన్నత స్థానంలో ఉండాలని అందరి మన్ననలు అందుకోవాలని కలలు కన్నా. సినిమాల్లోకి వెళ్లా అంటే నాన్న అంగీకరించలేదు. నటన పట్ల నాకున్న ఆసక్తి, తపన చూసి ఫైనల్‌గా ఓకే అన్నారు. తమిళ సినిమాతో నా కెరీర్‌ మొదలైంది. అవకాశాల కోసం రెండేళ్లకు పైగా కష్టపడ్డాను (Aamani struggles in Film industry) . ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు అవకాశాలు ఇస్తామంటూనే తమకు నచ్చినట్లు ఉండాలని పరోక్షంగా అనేవారు. ఒంటరిగా కలవమనేవారు. మా అమ్మ చొరవతో వాటన్నింటినీ తిరస్కరించా. కొంతకాలానికి వాళ్ల మాటల్లోని అర్థాలు తెలుసుకున్నాను. అప్పుడు చాలా బాధపడ్డాను. నాన్న చెప్పినా వినకుండా తప్పుడు మార్గంలోకి వచ్చేశానా? అనిపించింది. అయితే ఇండస్ట్రీలో అందరూ అలా ఉండరు. కొందరికే అలాంటి దుర్భుద్ది ఉంటుంది. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్న కొన్ని రోజులకే తెలుగులో ‘జంబ లకిడి పంబ’లో ఆఫర్‌ వచ్చింది. అదే నా తొలి తెలుగు సినిమా. అక్కడి నుంచి నా కెరీర్‌ మారిపోయింది. నటిగా దార్లో పడ్డాను. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ మారాను’’ అని చెప్పారు. (Senior actress Aamani)

నన్ను కాదని నగ్మాను...(Rikshavodu)

‘‘హీరోయిన్‌గా చిరంజీవి పక్కన నటించలేకపోయినందుకు బాధగా ఉంటుంది. నేను ఆయనకు వీరాభిమానిని. (Big Fan of chiranjeevi) ఈ మధ్యనే ఆయన్ను ఓ వేడుకలో కలిసి ఫ్యాన్‌గా ఫొటో దిగాను, ‘రిక్షావోడు’ సినిమాలో మొదట నన్ను కథానాయికగా ఎంచుకున్నారు. ఏమైందో తెలీదు కానీ ఆ రోల్‌ను నగ్మాకు ఇచ్చారు’’ అని ఆమని అన్నారు.

Updated Date - 2023-02-23T13:36:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!