‘కొత్త తరహా ‘రాక్షస కావ్యం’
ABN , First Publish Date - 2023-09-02T00:16:33+05:30 IST
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేశ్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’ శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దామురెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు....

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేశ్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’ శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దామురెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పౌరాణికాలను నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన కొత్త తరహా చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. ‘ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. గత వారం విడుదల చేసిన విలన్స్ అంథెమ్ సాంగ్ వైరల్ అయింది. సినిమా కూడా బాగా వచ్చింది. ప్రేక్షకులకు నచ్చే అంశాలు చిత్రంలో చాలా ఉన్నాయి’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాజీవ్ రాజ్, శ్రీకాంత్ , ఆర్.ఆర్. ధ్రువన్, సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేశ్ చిక్కు, సహ నిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధర దేవి.