సాగరాలు దాటిన ప్రేమకథ

ABN , First Publish Date - 2023-09-16T00:36:11+05:30 IST

కన్నడ హీరో రక్షిత్‌శెట్టి కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ అక్కడ ఘన విజయం అందుకొంది....

సాగరాలు దాటిన ప్రేమకథ

కన్నడ హీరో రక్షిత్‌శెట్టి కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ అక్కడ ఘన విజయం అందుకొంది. క్లాసిక్‌ లవ్‌స్టోరీగా కన్నడ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్‌ నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఇక్కడ విడుదల చేస్తోంది. ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించారు. ‘అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ’ చిత్రాలతో రక్షిత్‌శెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చెప్పారు.

Updated Date - 2023-09-16T00:36:11+05:30 IST