‘స్వాతి’ బలరామ్ బయోపిక్
ABN , First Publish Date - 2023-04-24T23:53:12+05:30 IST
నలభై ఏళ్లుగా ‘స్వాతి’ వారపత్రికను విజయవంతంగా నడుపుతున్న వేమురి బలరామ్ జీవిత కథను ‘స్వాతి బలరామ్..

నలభై ఏళ్లుగా ‘స్వాతి’ వారపత్రికను విజయవంతంగా నడుపుతున్న వేమురి బలరామ్ జీవిత కథను ‘స్వాతి బలరామ్.. అతడే ఒక సైన్యం’ పేరుతో సినిమాగా తీస్తున్నారు ప్రముఖ రచయిత, దర్శకుడు ప్రభాకర్ జైనీ. ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’, ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్ రూపుదిద్దుకున్నాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై స్వాతి బలరామ్ బయోపిక్‌ను విజయలక్ష్మి జైనీ నిర్మించనున్నారు. ఈ బయోపిక్ గురించి ప్రభాకర్ వివరిస్తూ ‘బలరామ్‌గారు జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా వాటికన్నా ఎక్కువ విషాదాలే ఉన్నాయి. తన పత్రికను ఈ స్థాయికి తీసుకురావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ బయోపిక్‌కు శ్రీకారం చుట్టాను. విజయవాడలోని వారి ఇంట్లో, ఆఫీసులో, కొడాలి, ఘంటసాల గ్రామాల్లో ఒక ఫెడ్యూల్ పూర్తి చేశాం. ఇప్పుడు మిగిలిన షూటింగ్ కోసం బలరామ్‌గారు యవ్వనంలో, మధ్య వయసులో ఉన్నప్పుడున్న పోలికలు కలిగిన నటుల కోసం వెదుకుతున్నాం. ఒక మంచి సినిమా ఇది రూపొందుతుందనే నమ్మకం నాకు ఉంది’ అన్నారు.