సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shaakuntalam: మరీ ఇంత ధారుణమా, గుణశేఖర్ కి చాలా పెద్ద దెబ్బ ఇది

ABN, First Publish Date - 2023-04-17T12:28:43+05:30

శాకుంతలం సినిమా ఫెయిల్యూర్ దర్శకుడు గుణశేఖర్ కి చాలా పెద్ద దెబ్బ. అతను తన తదుపరి సినిమా ఇలా చారిత్రం, పౌరాణికం అని పట్టుకుంటే అతని కెరీర్ కె ముప్పు వచ్చే అపాయం వుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా వలన నష్టం మాత్రం పూడ్చలేనిది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఎంతో గొప్పగా వర్ణించిన 'శాకుంతలం' (Shaakuntalam) సినిమా బాక్స్ ఆఫీస్దగ్గర మొత్తం ఫెయిల్ అయింది. సమంత (Samantha) ఇందులో శకుంతల పాత్ర పోషించింది, ఆమె కూడా ఈ సినిమా తన కెరీర్ లో ఒక పెద్ద సినిమా గా ఉండబోతోందని చాలా గొప్పగా చెప్పింది. ఇంత పెద్ద గొప్ప దర్శకుడి సినిమా ఇంత ఘోరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అవటం నిజంగా ఈమధ్య కాలంలో ఏ సినిమాకి కూడా ఇలా జరగలేదు.

అసలు ఈ సినిమాని నమ్మి నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రీమియర్ షోలు వెయ్యడం కూడా చాలా తప్పు చేశారు అని కొందరు పరిశ్రమలో అంటున్నారు. ఎందుకంటే ప్రీమియర్ షో లు వెయ్యకపోతే కనక, మొదటి రోజు కొంతయినా కలెక్షన్స్ ఉండేవని, అవి వెయ్యటం వల్లనే మొదటి రోజు చాలా నెగటివ్ స్ప్రెడ్ అయిందని, అందువల్ల కలెక్షన్స్ అసలు రాలేదని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

ఇక దర్శకుడు గుణశేఖర్ కి ఈ సినిమా ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. గుణశేఖర్ జానర్ ఇలా పౌరాణికాలు, చారిత్రాత్మకాలు కాదు, అతను ఎందులో సినిమా తీయగలడో అందులోనే తీయాలి. అవి మానేసి ఇలా పౌరాణికం అంటూ ఎదో ఒక నాసి రకం గ్రాఫిక్ పెట్టేసి, చుట్టేసి, దానినే మళ్ళీ ఇంకో నాసిరకం త్రీడీ అని చెప్పి తీసి, జనల మీదకి వదిలితే అది ఎందుకు ఆడుతుంది అని పరిశ్రమలో అంటున్నారు.

'ఒక్కడు', 'చూడాలని వుంది', 'సొగసు చూడ తరమా', 'మనోహరం', 'అర్జున్' లాంటి సినిమాలు తీసిన గుణశేఖర్ తనకి ఏ జానర్ అయితే ప్రేక్షకులు నచ్చుతారో అందులోనే తన ప్రతిభ చూపాలి. అంతేకానీ ఇలా తనకి చేతకాని వాటి మీద ఎందుకు ప్రయోగాలు చెయ్యటం అని పరిశ్రమలో అంటున్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే దానికి ఎంతో రీసెర్చ్ అవసరం అలాగే చాలా సహనం కూడా కావాలి. వూరికే ఎమోషనల్ గా ఉంటే సరిపోదు.

మూడు రోజులకు గాని ఈ సినిమా కనీసం అయిదు కోట్లు (Rs 5 Crore) కూడా కలెక్టు చేయలేదంటే ఎంత దారుణంగా ఈ సినిమాని వ్యతిరేకించారో అర్థం అవుతుంది. మూడో రోజు అయిన సండే (Sunday) కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. ప్రేక్షకులకు ఇప్పుడు సినిమాలో ఏదైనా ఒక అద్భుతమయిన కథ, కథనం లేదా ఇంకేమైనా మెస్మరైసింగ్ కంటెంట్ ఉండాలి. అవేమి లేకుండా ఒక నాసిరకం సినిమా తీసి ఇప్పటి యూత్ చూడాలి అని చెపితే చూస్తారా? అని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-04-17T12:28:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!