7/G brundavan colony - Ravi krishna : పూర్తిగా ఒక్కసారే చూశా... క్లైమాక్స్‌ చూస్తే తట్టుకోలేను..!

ABN , First Publish Date - 2023-09-17T14:04:39+05:30 IST

'7/జీ బృందావన కాలనీ’ చిత్రం 2004లో సంచలనం సృష్టించిన చిత్రం. ఎ.ఎం.రత్నం నిర్మాణంలో ఆయన తనయుడు రవికృష్ణ హీరోగా నటించారు. సోనియా అగర్వాల్‌ కథానాయిక. సెల్వ రాఘవన్‌ దర్శకుడు. ఇప్పుడీ చిత్రం రీ రిలీజ్‌కు సిద్థమైంది. డిజిటలైజ్‌ చేసి 4కే వెర్షన్‌లో ఈ నెల 22న విడుదల చేయనున్నారు.

7/G brundavan colony - Ravi krishna : పూర్తిగా ఒక్కసారే చూశా... క్లైమాక్స్‌ చూస్తే తట్టుకోలేను..!

'7/జీ బృందావన కాలనీ’ (7/G brundavan colony) చిత్రం 2004లో సంచలనం సృష్టించిన చిత్రం. ఎ.ఎం.రత్నం (AM Ratnam)నిర్మాణంలో ఆయన తనయుడు రవికృష్ణ (Ravi krishna) హీరోగా నటించారు. సోనియా అగర్వాల్‌ కథానాయిక. సెల్వ రాఘవన్‌ (Selva raghavan) దర్శకుడు. ఇప్పుడీ చిత్రం రీ రిలీజ్‌కు సిద్థమైంది. డిజిటలైజ్‌ చేసి 4కే వెర్షన్‌లో ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో.. రవికృష్ణ మాట్లాడుతూ ‘‘రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూస్తుంటే అప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఇందులో హీరో పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా. ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని ఒక్కసారే పూర్తిగా చూశా. ఎందుకంటే, క్లైమాక్స్‌ చూడటం నా వల్ల కాదు. ఒకవేళ సినిమా చూేస్త నేను ఆ పాత్రలోకి వెళ్లిపోతా. షూటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా.. ఓ రోజు ఇంట్లో నిరాశగా ఏదో ఆలోచిస్తూ కూర్చొన్నా. నన్ను అలా చూసి మా అమ్మ షాకయ్యారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పార్ట్‌ 2 తీస్తున్నాం’’ అని అన్నారు.

Sonia.jpg

నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ.. ‘‘కర్తవ్యం’, ‘భారతీయుడు’ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించి ఇండస్ర్టీలో మంచి పేరు సొంతం చేసుకున్నా. నేను నిర్మించిన చిత్రాల్లో ‘7జీ బృందావన కాలనీ’ ఒక కల్ట్‌ మూవీ. ఈ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి విడుదల చేస్తున్నాం. వచ్చే నెల నుంచి పార్ట్‌ 2 పనులు మొదలు కానున్నాయి. ‘7జీ బృందావన కాలని’ని తెరకెక్కించిన సెల్వరాఘవన్‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు’’ అని చెప్పారు.

Updated Date - 2023-09-17T14:08:05+05:30 IST