75 రోజులు .. కశ్మీర్‌లో!
ABN , First Publish Date - 2023-09-02T00:14:58+05:30 IST
విశిష్ట నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై శివకార్తికేయన్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.....

విశిష్ట నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై శివకార్తికేయన్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. శివకార్తికేయన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో ప్రజెంట్ చేయనున్నారు. దేశభక్తి కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం 75 రోజుల పాటు కశ్మీర్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని దర్శకుడు చెప్పారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్.