Big Boss Sohail: నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను

ABN , First Publish Date - 2023-08-17T16:23:01+05:30 IST

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఇందులో అతను మేల్ ప్రెగ్నెంట్ పాత్రలో కనిపించనున్నాడు, కాగా రూపా కొడవాయుర్ కథానాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. రేపు శుక్రవారం విడులవుతోంది, ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నైజాంలో విడుదల చేస్తోంది. ఈ సినిమా గురించి సోహైల్ తన అనుభవాలను పంచుకున్నారు.

Big Boss Sohail: నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను
Sohel

బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను, అయితే సినిమాలో కథానాయకుడిగా నటిస్తే నన్ను చూసేందుకు థియేటర్ దాకా వస్తారా అనే సందేహం మొదట్లో ఉండేది. ఎందుకంటే స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కవుట్ అవుతుంది, వాళ్లకు అభిమానులు ఉంటారు, కానీ నాలాంటి యువ నటులు వెరైటీ మూవీస్, కొత్త ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు మన సినిమాలకు వస్తారు అని నమ్మాను. అందుకే 'మిస్టర్ ప్రెగ్నంట్' లాంటి న్యూ జానర్ మూవీ చేస్తున్నాను అని చెప్పాడు సోహైల్. ఇలా చెయ్యడం రిస్క్ కాదని, ఎందుకంటే తనలాంటి యంగ్ యాక్టర్స్ రొటీన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయడమే రిస్క్ అవుతుంది అని అన్నాడు.

sohail1.jpg

ఈ సినిమా దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తనకి ఎనిమిదేళ్లుగా స్నేహితుడని, అతను ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద నటుడితో సినిమా చేయాలని అనుకున్నాడు. ఇద్దరు కొత్తవాళ్లు కాబట్టి మన సినిమాకు క్రేజ్ రాదు అని అంటూవుండేవాడు. అయితే అప్పటికి సోహైల్ ఇంకా 'బిగ్ బాస్' లోకి వెళ్లలేదు. ఆ తరువాత 'బిగ్ బాస్' నుంచి వచ్చాక ఈ సినిమాకు నువ్వే కథానాయకుడివి అని చెప్పి సైన్ చేయించాడు. అలా ఈ మూవీ స్టార్ట్ అయ్యింది అని చెప్పుకొచ్చాడు సోహైల్.

ఇలా మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో నటించడం ఒక డిఫరెంట్ ఎక్సీపిరియన్స్ అంటూ సోహైల్ ఈ సినిమా వొప్పుకునేట్టప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు అని చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరినీ ఎలా నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, పనులు చేస్తున్నారు లాంటివి గమనించేవాడిని అని చెప్పాడు. ఈ క్యారెక్టర్ చేసేప్పుడు సోహైల్ మూడు కిలోల బరువున్న ప్రోత్సటిక్స్ కూడా ధరించాడు. ఆ కొద్ది బరువే ఇబ్బందిగా అనిపించేది అతనికి, అలాంటిది తొమ్మిది నెలలు అమ్మ మనల్ని మోసేందుకు ఎంత కష్టపడుతుందో మనం ఊహించుకోవచ్చు అని అమ్మతనాన్ని గురించి చెప్పాడు.

sohail2.jpg

ఈ మేల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ ఒకవేళ అదే కనక నిజంగా సాధ్యమైతే కనీసం 20 శాతం మంది మేల్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. అది ఎలా ఉంటుందో తెలుసు కునేందుకైనా తీసుకుంటారు అని చెప్పాడు ఇక ఈ సినిమా అనౌన్స్ చేశాక సోహైల్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి, అప్పుడు అతన్ని ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని అనుకున్నాడు. ఈ సినిమా గురించి సోహైల్ మదర్ కూడా మొదట్లో నెగిటివ్ గా చెప్పింది, కానీ సినిమా చూశాక ప్రౌడ్ గా ఫీలయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావని సోహైల్ ని మెచ్చుకుంది.

ఈ సినిమా షూటింగ్ అయిపొయింది కానీ విడుదలకి కొంచెం టైము పట్టింది. అప్పుడు ఈ సినిమా విడుదల ఆలస్యమయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అని అంటున్నాడు. "ఎందుకంటే ఈ సినిమాపై నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఇది నా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమా అని నమ్ముతున్నాను", అన్నాడు సోహైల్. అలాగే ఈ సినిమా గ్లింప్స్ చూపించినప్పుడు నాగార్జున గారు చాలా అప్రిషియేట్ చేశారు. "నువ్వు డిఫరెంట్ మూవీ చేస్తున్నావు. కొత్త వాళ్లు ఇలాగే కొత్త ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది," అని చెప్పాడు సోహైల్.

sohail3.jpg

తాను చిన్న వయసులోనే పరిశ్రమలో అడుగు పెట్టాను అని, ఇంకా సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పాడు. రోజూ సినిమాల కోసమే కష్టపడుతుంటా అని చెపుతూ ప్రస్తుతం 'బూట్ కట్ బాలరాజు' షూటింగ్ జరుగుతోందని, అలాగే ఇంకో సినిమా కూడా సైన్ చేసానని అన్నాడు. సెలెక్టెడ్ గా మూవీస్ చేసుకుంటూ బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానా లా తెలుగులో కూడా అతనిలా డిఫరెంట్ మూవీస్ చేయాలని ఉంది అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-08-17T16:23:01+05:30 IST