Sakshi Vaidya: ఏజెంట్ ఆడకపోతే ఎటువంటి పర్సనల్ ఫీలింగ్ అయితే లేదు కానీ బాధపడ్డాను

ABN , First Publish Date - 2023-08-21T18:36:43+05:30 IST

వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’ ఈ వారంలోనే విడుదలవుతోంది. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకుడు, ఈ సినిమా ఆగ‌స్ట్ 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయకురాలు సాక్షి వైద్య ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు.

Sakshi Vaidya: ఏజెంట్ ఆడకపోతే ఎటువంటి పర్సనల్ ఫీలింగ్ అయితే లేదు కానీ బాధపడ్డాను
Sakshi Vaidya

ఈ 'గాండీవ‌ధారి అర్జున' #GandeevadhariArjuna సినిమాలోకి ఆమె ఎలా వచ్చింది అన్నదానిగురించి చెపుతూ, 'ఏజెంట్' #Agent సినిమా విడుదల కాకముందే కొన్ని షాట్స్‌ను దర్శకుడు ప్రవీణ్ (PraveenSattaru) చూశారు. ఈ సినిమాకు కొత్త కథానాయకురాలు కావాలని అనుకున్నారు. అలాగే ఐరా పాత్రకు సెట్ అవుతానని అనుకోని తీసుకున్నారు అని చెపుతోంది సాక్షి. ఇందులో నాజర్‌ (Nasser) గారి పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది, ఆయన పక్కనే కనిపించే నా పాత్ర చాలా బాగుంటుంది అని చెపుతోంది.

sakshivaidya2.jpg

కో స్టార్ వరుణ్ తేజ్ (VarunTej) గురించి మాట్లాడుతూ అతను పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు, అందుకని సెట్స్ మీద ఎలా ఉంటాడో అని మొదట్లో భయపడుతూ ఉండేదాన్ని అని చెప్పింది. కానీ వరుణ్ తనని పిలిచి మాట్లాడేవారు అని, అలాగే ఎంతో ఒదిగి ఉండేవారని, అలాగే ఈ ప్రయాణంలో తనకి వరుణ్ చాలా సాయం చేశారు అని చెప్తోంది సాక్షి. అందువలనే ఇప్పుడు తెలుగు కొంచెం కొంచెం అర్థం అవుతుంది అని కూడా చెప్తోంది.

తన మొదటి సినిమా అఖిల్ అక్కినేని (AkhilAkkineni) పక్కన చేసిన 'ఏజెంట్' #Agent బాగా ఆడకపోయినప్పుడు కాస్త బాధగా అనిపించింది. "నాకు పర్సనల్‌గా ఎలాంటి ఫీలింగ్ అనిపించలేదు కానీ, టీం అంత ఎంతో కష్టపడి పని చేసింది, అంత కష్టపడి పని చేసినా ఫెయిల్ అవ్వడం బాధగా అనిపించింది," అని చెప్పింది.

sakshivaidya3.jpg

పవన్ కళ్యాణ్ (PawanKalyan) సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' #UstaadBhagathSingh షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది అని అంటూ సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) తో కూడా ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పింది. జూలై‌లో ఖాళీగా ఉండటంతో ప్రైవేట్ ఆల్బమ్ చేశాను, అయితే తెలుగులోనూ అలాంటి అవకాశం వస్తే ప్రైవేట్ ఆల్బమ్‌లో తప్పకుండా నటిస్తాను అని అంటోంది.

దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేశారు, కనీసం వ్యానిటీకి వెళ్లి రెస్ట్ తీసుకునే టైం కూడా దొరకలేదు. దానివలన తాను ఎప్పుడూ ఆ పాత్రలోనే ఉండటం, ఆ పాత్రలానే ప్రవర్తించేదాన్ని అని చెప్పింది. అలాగే లండన్‌లో షూటింగ్ చేయడం, మంచులో నటించడం కష్టంగా అనిపించలేదు కానీ, డ్రైవింగ్ అంతగా రాకపోవటంతో, ఆ సన్నివేశాలు చెయ్యడానికి ముందు కొంచెం భయపడ్డాను అని మాత్రం చెపుతోంది.

sakshi-vaidya.jpg

ఎలాంటి పాత్రలు చెయ్యాలని అనుకుంటున్నారు అంటే, 'యశోద' #Yashoda సినిమాలో సమంత (Samantha) చేసిన పాత్రలాంటివి వస్తే చేయాలని ఉంది. అలాగే ప్రేమ కథా చిత్రాలు కూడా చేయాలని ఉంది. ఇక ఈ 'గాండీవధారి అర్జున' సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను అని చెప్తోంది. అలాగే తెలుగు భాషను నేర్చుకుని అభిమానులకు ప్రేమను తిరిగి ఇస్తాను అంటోంది. నాకు తెలుగులో అల్లు అర్జున్ (AlluArjun) అంటే ఇష్టం అంటోంది. రామ్ చరణ్ (RamCharan) నటించిన 'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాను చూశానని, మా సినిమా ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చెయ్యడం ఆనందంగా ఉంది. దుల్కర్ సల్మాన్‌తో (DulquerSalman) 'లక్కీ భాస్కర్', #LuckyBhaskar సాయిధరమ్ తేజ్ సినిమాల్లోనూ నటిస్తున్నాను అని తన రాబోయే సినిమాల గురించి చెపుతూ రవితేజ (RaviTeja) గారి తోనూ నటించే అవకాశం ఉంది అని చెప్పింది.

Updated Date - 2023-08-21T18:36:43+05:30 IST