Srikanth: వారసుడు.. పండగకి పండగలాంటి సినిమా

ABN , First Publish Date - 2023-01-03T22:41:09+05:30 IST

దళపతి విజయ్ (Vijay), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు/వారిసు’ (Varasudu/Varisu). తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా

Srikanth: వారసుడు.. పండగకి పండగలాంటి సినిమా
Hero Srikanth

దళపతి విజయ్ (Vijay), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు/వారిసు’ (Varasudu/Varisu). తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై.. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ (Srikanth) కీలక పాత్ర పోషించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ ‘వారసుడు’ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ..

‘‘నా కెరీర్‌లో తమిళ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దర్శకుడు వంశీ పైడిపల్లి ‘వారసుడు’ కథ చెప్పారు. ఇందులో విజయ్‌కి బ్రదర్‌గా కనిపిస్తా. చాలా కీలకమైన పాత్ర ఇది. ‘వారసుడు’ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌. అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ వుంటాయి. సినిమా ఒక దృశ్యకావ్యంలా వుంటుంది. విజువల్స్ అద్భుతంగా వుంటాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ ఇది పక్కా తెలుగు సినిమాలానే వుంటుంది. రష్మిక, జయసుధ గారు, నేను, కిక్ శ్యామ్, శరత్ కుమార్, సంగీత, ప్రభు.. ఇలా అందరం తెలుగులో సినిమాలు చేసిన వారే వుండటంతో ఇది పూర్తి తెలుగు నేటివిటీ వున్న సినిమాలానే వుంటుంది. ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే ఎమోషన్స్ ఇందులో వుంటాయి. వంశీ పైడిపల్లి సినిమాలలో గ్రేట్ ఎమోషన్స్ వుంటాయి. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ్‌కి అద్భుతమైన క్రేజ్ వుంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేయలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వారసుడిని తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర మొదటి నుండి చివరి వరకూ వుంటుంది. విజయ్ లాంటి స్టార్ హీరోతో ఒక మంచి సినిమాతో తమిళంలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా వుంది. (Srikanth Interview)

విజయ్‌ని ఇంతకుముందు కొన్ని వేడుకల్లో కలిశాను. ఆయనతో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. విజయ్ చాలా సైలెంట్‌గా వుంటారు. ఎక్కువగా మాట్లాడరు. కారావాన్ వాడరు. సెల్ ఫోన్ దగ్గర వుండదు. ఒకసారి సెట్‌లో అడుగు పెడితే ప్యాకప్ చెప్పినంతవరకూ అక్కడ నుండి కదలరు. చాలా అంకితభావంతో పని చేస్తారు. నాకు, విజయ్‌కి ఒక ఫ్యామిలీ‌లో అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిస్థితులు, గొడవలు ఉంటాయో అలాంటి సీన్స్ వుంటాయి. (Hero Srikanth about Vijay)

ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియాలా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు కూడా అక్కడ హిట్లు కొడుతున్నాయి. సంక్రాంతి సినిమాల పండగ కూడా. అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. వారసుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పండగకి పండగ లాంటి సినిమా. వంశీ పైడిపల్లి చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఫిలిం మేకింగ్ లో చాలా పెర్ఫెక్షన్ వుంటుంది. ఎక్కడా రాజీపడకుండా తీస్తారు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో వున్నప్పటికీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం ఇదే తొలిసారి. అలాగే శంకర్ గారి సినిమాలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచన వుంది. కథ, క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. సంక్రాంతికి వస్తున్న అన్ని చిత్రాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు..’’ అని చెప్పుకొచ్చారు. (Srikanth Varasudu Movie Interview)

Updated Date - 2023-01-03T22:43:59+05:30 IST